Tollywood No 1 Hero: మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నెంబర్ గేమ్ మీద అభిమానులకు ఉండే ఆసక్తి మామూలుది కాదు అనే చెప్పాలి..మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా కొనసాగారు, 2007 వ సంవత్సరం లో ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్ళేలోపు మెగాస్టార్ తర్వాత నెంబర్ 1 హీరో ఎవ్వరు అనే దానిపై ఎన్నో లైవ్ డిబేట్స్ జరిగాయి..పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు రామ్ చరణ్ వంటి వారు రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తూ తమకంటూ ఇండస్ట్రీ లో ఒక్క ప్రత్యేకమైన స్థానం సంపాదించారు..కానీ నెంబర్ 1 స్థానం లో స్థిరంగా నిలబడలేకపోయారు అనే చెప్పాలి..ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ , ప్రభాస్ మరియు అల్లు అర్జున్ వంటి వారు భారీ హిట్స్ కొట్టి నెంబర్ 1 స్థానం కి గట్టి పోటీనే ఇచ్చారు..ప్రస్తుతం ఈ హీరోల ఊపు చూస్తుంటే ఎవరు నెంబర్ 1 అని చెప్పడం పెద్ద కష్టం అయిపోయింది, అసలు ఈ నెంబర్ స్థానం ని దేనిని చూసి ఇస్తారు..?, సదరు హీరో కి ఉన్న ఫ్యాన్ బేస్ ని చూసి ఇస్తారా..లేదా హిట్స్,ఇండస్ట్రీ హిట్స్ ని చూసి ఇస్తారా అనేది ఈ అంశం గురించి చర్చకు వచ్చినప్పుడల్లా వచ్చే డౌట్.

టాలీవుడ్ కి చెందిన ఒక్క ప్రముఖ ఏజెన్సీ ఇటీవల ఒక్క సర్వే నిర్వహించింది..ఈ సర్వే ని రెండు విభాగాలుగా విభజించి చూసి నెంబర్ 1 ఇతనే అంటూ చెప్పుకొచ్చింది, మొదటి సర్వే లో ఓపెనింగ్స్ పరంగా ఎవరు నెంబర్ 1 అని ఆరా తియ్యగా అత్యధిక మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓపెనింగ్స్ లో నెంబర్ 1 అని చెప్పుకొచ్చారు..టాలీవుడ్ లో టాక్ తో సంబంధం లేకుండా అమెరికా నుండి అనకాపల్లి వరుకు ప్రతి సెంటర్ లో మొదటి రోజు ఆల్ టైం డే 1 రికార్డు పెట్టె సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది అని ఈ సర్వే చెప్తోంది, పవన్ కళ్యాణ్ తర్వాత ఓపెనింగ్స్ లో కింగ్ గా జూనియర్ ఎన్టీఆర్ పేరు ని అత్యధిక మంది తెలిపారు..జూనియర్ ఎన్టీఆర్ కి కూడా టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు రికార్డ్స్ వస్తాయి అని, కానీ నైజాం మరియు ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ కి వచ్చే ఓపెనింగ్స్ తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ కాస్త వెనకబడుతాడు అని ఈ సర్వే సారాంశం..ఇక వీళ్లిద్దరి తర్వాత ఓపెనింగ్స్ అద్భుతంగా రాణించే హీరోగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు అత్యధిక మంది చెప్పినట్టు సమాచారం..నైజం ఏరియా లో అయితే ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ కంటే ప్రస్తుతం మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని..నైజం కింగ్ ప్రస్తుతం ప్రభాస్ మాత్రమే అని..ఆయన తర్వాతే పవన్ కళ్యాణ్ అంటూ ఈ సర్వే లో తేలింది..కానీ ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ తర్వాతే ఓపెనింగ్స్ లో ప్రభాస్ నిలుస్తాడు అని ఈ సర్వే సారాంశం.
Also Read: ఆలియా పెళ్లికి ఆ గిఫ్ట్స్ ఇస్తున్న ‘ఎన్టీఆర్ – చరణ్’ !
ఇక ఈ సర్వే రెండో విడత గా లాంగ్ రన్ లో ఎవరు నెంబర్ 1 హీరో అనే దానిపై చెయ్యగా మహేష్ బాబు , అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ మధ్య తీవ్రమైన పోటీ జరిగినట్టు తెలుస్తుంది..ప్రస్తుతం ఇండస్ట్రీ లో లాంగ్ రన్ రికార్డ్స్ ఉన్న సినిమాలు అన్ని ఈ ముగ్గురు పేరు మీదనే ఉన్నాయి..మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలతో మహేష్ బాబు ఇండస్ట్రీ లో ఎలాంటి రికార్డ్స్ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..దీనితో మహేష్ బాబు నెంబర్ 1 అని అత్యధిక మంది ఈ సర్వే లో తెలిపారు..ఇక మహేష్ బాబు తర్వాత అల్లు అర్జున్ పేరునే చెప్పారు, ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ సినిమాలు అలా వైకుంఠపురం లో మరియు పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ అల్లు అర్జున్ కంటే ఎక్కువగా మహేష్ బాబు కెరీర్ లాంగ్ రన్ సినిమాలు ఉండడం తో లాంగ్ రన్ లో మహేష్ బాబు నెంబర్ 1 అని తేల్చి చెప్పింది ఈ సర్వే..ఇక వీళ్లిద్దరి తర్వాత లాంగ్ రన్ రికార్డ్స్ లో తోపుగా నిలిచినా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..చేసింది అతి తక్కువ సినిమాలే అయినప్పటికీ మగధీర , రంగస్థలం మరియు #RRR చిత్రాలతో లాంగ్ రన్ రికార్డ్స్ లో ఆయన ఒక్క ప్రభంజనం సృష్టించాడు అనే చెప్పాలి..మొత్తం మీద ఓపెనింగ్స్ లో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ అని..లాంగ్ రన్ రికార్డ్స్ లో మహేష్ బాబు నెంబర్ 1 హీరో అని ఈ సర్వే సారాంశం గా చెప్పవచ్చు.
[…] Pooja Hegde: ‘పూజా హెగ్డే’కి ఐటమ్ సాంగ్స్ కొత్తేమి కాదు. ‘రంగస్థలం’ సినిమాలో పూజా ‘జిగేల్ రాణి’ అంటూ ఓ ఐటమ్ పాట చేసింది. అయితే, ఆ సినిమా తర్వాత ‘పూజా హెగ్డే’ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో డబుల్ అయ్యింది. దాంతో.. అమ్మడు ఇక మళ్లీ ఐటమ్ పాటల జోలికి పోలేదు. కానీ.. ప్రస్తుతం ‘పూజా హెగ్డే’.. ‘ఎఫ్ 3’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. […]
[…] Katrina Kaif: బాలీవుడ్ అందాల హీరోయిన్ కత్రీనా కైఫ్ తల్లి కాబోతుందని.. త్వరలోనే తన అభిమానులకు ఆ తీపి కబురు చెప్పబోతుందని తాజాగా సోషల్ మీడియాలో బాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కత్రీనా కైఫ్ గతేడాది పెళ్ళి చేసుకొంది. పెళ్లి అయిన నాలుగు నెలల తర్వాత నుంచి తన భర్త విక్కీతో ముంబైలోనే కాపురం పెట్టింది. […]
[…] Hero Yash: కేజీఎఫ్ సినిమాతో కన్నడ స్టార్ యష్ పేరు మన దేశం మొత్తం మారుమోగి పోయింది. ఈ సినిమాతోనే యష్ స్టార్ హీరో గా ఎదిగి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించు కున్నాడు. 2018 లో కేజిఎఫ్ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల తర్వాత యష్ రాఖీ బాయ్ గా భారీ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల రేంజ్ కి ఎదిగి పోయాడు. […]