TDP Party
TDP Party : జీవి రెడ్డి ( jv Reddy) రాజీనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ తో పాటు టిడిపి సభ్యత్వానికి సైతం జీవి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే జీవి రెడ్డి వ్యవహారంలో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురవుతోంది. క్యాడర్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. పార్టీ సొంత సోషల్ మీడియాలో కూడా జీవి రెడ్డికి అండ పెరిగింది. సోమవారం సాయంత్రం జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాకు కూడా గుడ్ బై చెప్పారు. ఏకంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే జీవి రెడ్డి రాజీనామా వ్యవహారం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం కాస్త బాధపడింది.
* బలమైన నేత దూరం
ఒక ఐపీఎస్ అధికారి( IPS officer) కోసం జీవి రెడ్డి లాంటి నేతను వదులుకోవడం మాత్రం సాక్షాత్ ఐ టీడీపీ విభాగం నాయకులు బాధపడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. న్యాయవాద వృత్తిలో ఉన్న జీవి రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఒక్క జీవి రెడ్డి కాదు.. చాలామంది టిడిపి నాయకులు అధికారుల తీరుతో బాధపడుతున్నారని.. ఐ టీడీపీ సభ్యులు కూడా బాధిత వర్గాలేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయంలో హై కమాండ్ దృష్టి సారించకపోతే.. పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్న వారు ఉన్నారు.
* ముందే ఆ పని చేసి ఉంటే..
అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజావేదికను కూల్చారు. అయితే అప్పట్లో నేతలు వద్దని వారించినట్లు తెలుస్తోంది. కేవలం కొందరు అధికారుల తీరుతోనే అప్పట్లో ప్రభుత్వం అలా వ్యవహరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సూచించింది. అయితే ఇదే బదిలీ ఏపీ ఫైబర్ చైర్మన్ జీవి రెడ్డి చెప్పిన వెంటనే ప్రభుత్వం స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.
* అప్పట్లో మాదిరిగానే
అప్పట్లో వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో తీసుకున్న నిర్ణయాలే.. ఇప్పుడు కూడా టిడిపి ప్రభుత్వం( TDP government) తీసుకుంటూ ఉందని చాలామంది టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్య ఉన్న అధికారులే.. ఇప్పుడు కూడా ఉన్నారని.. వారి తీరుతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారుల కోసం విలువైన నేతలను వదులుకోకూడదని.. అలా చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతాయో..