spot_img
Homeఎంటర్టైన్మెంట్Karuppu sensational opening: సూర్య 'కరుప్పు(వీరభద్రుడు)' కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. ఇంత గ్రాస్ అసలు ఊహించలేదు..

Karuppu sensational opening: సూర్య ‘కరుప్పు(వీరభద్రుడు)’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. ఇంత గ్రాస్ అసలు ఊహించలేదు..

Karuppu sensational opening: చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో ఒకరు సూర్య. తెలుగు , తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో , సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి స్టార్ ఆయన. కానీ 2013 వ సంవత్సరం నుండి గత ఏడాది వరకు సూర్య చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదలైన సినిమాలు అయితే, సూర్య మార్కెట్ ని పాతాళం లోకి నెట్టేశాయి. అయితే నేడు విడుదలైన ‘కరుప్పు’ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కేవలం తమిళనాడు ప్రాంతం లో మాత్రమే కాదు , తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి.

బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి తమిళ వెర్షన్ గంటకు 45 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అదే విధంగా తెలుగు వెర్షన్ లో గంటకు 5 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి , ఓవరాల్ గా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో రెండు వెర్షన్స్ కి కలిపి గంటకు 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు , ఇప్పటి వరకు తమిళం లో కేవలం రజినీకాంత్, విజయ్ లకు మాత్రమే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి , ఆ తర్వాతి స్థానం లో ఇప్పుడు సూర్య నిలిచాడు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కేవలం తెలుగు వెర్షన్ నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావొచ్చు అట.

అటు తమిళం లో , ఇటు తెలుగు లో గడిచిన నాలుగు నెలల నుండి సరైన కమర్షియల్ హిట్ లేకపోవడం కరుప్పు చిత్రానికి బాగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు. ఆడియన్స్ మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారని, అది కరుప్పు రూపం లో రావడంతో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారని , మొదటి రోజు బుక్ మై షో లో ఈ చిత్రానికి 6 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు. మరి ఇదే రేంజ్ ఫ్లో ని వీకెండ్ వరకు కొనసాగిస్తే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి దాదాపుగా దగ్గరకు వెళ్ళినట్టే అనుకోవచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular