Sensational Movie 'The Goat Life' Coming to OTT Streaming Where?
The Goat Life : మలయాళ సూపర్ హిట్ మూవీ ది గోట్ లైఫ్ ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారిక సమాచారం అందుతుంది. మరి ఈ క్రేజీ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? సలార్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్. ఆయన మెయిన్ లీడ్ లో నటించిన సినిమానే ” ది గోట్ లైఫ్ ”. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రం మార్చి లో ధియేటర్స్ లో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.
విడుదలైన పది రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. థియేట్రికల్ రన్ పూర్తి కావడంతో ఓటీటీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. కాగా మే 10 నుంచి హాట్ స్టార్ లో ఆడు జీవితం స్ట్రీమింగ్ అవుతున్నట్లు సమాచారం. దాంతో ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికొస్తే .. ఈ మూవీ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
ఇందులో పృథ్వి రాజ్ సుకుమారన్ వలస వెళ్లిన ఓ కేరళ కూలి నిజ జీవిత పాత్ర పోషించారు. 1990లో సౌదీ వెళ్లి అక్కడ ఎలాంటి బానిసత్వానికి గురైయ్యారు .. వాళ్ళు అనుభవించిన కష్టాలు ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. కేవలం మళయాళం లోనే కాకుండా ఈ సినిమాకు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పృథ్వి రాజ్ నటన ఆకట్టుకుంది. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి బ్లేస్సి దర్శకుడు. 2008లోనే ఈ చిత్రాన్ని పునాదులు పడ్డాయి. సిల్వర్ స్క్రీన్ పైకి రావడానికి 16 ఏళ్ల సమయం పట్టింది.
ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. తక్కువ బడ్జెట్ లో కథను బిన్నంగా ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చూపించడంలో మలయాళీ మేకర్స్ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే మంజుమ్మేల్ బాయ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇక పృథ్వి రాజ్ ‘ ఆడు జీవితం’ ఓటీటీ ప్రియులను ఏ విధంగా ఆకట్టుకోనుందో చూడాలి మరి.