https://oktelugu.com/

Getup Srinu : పవన్ కోసం ప్రచారం చేసేందుకు జబర్దస్త్ కమెడియన్స్ కోట్లు తీసుకున్నారా… గెటప్ శ్రీను క్లారిటీ ఇదే

రోజా కామెంట్స్ కూడా చిన్నవిగా తీసుకుంటాము అని శ్రీను కౌంటర్ ఇచ్చాడు. నేను ఇతర హీరోలతో కూడా నటించానని ఆయన అన్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 6, 2024 / 09:44 PM IST

    Jabardast Comedian Getup Srinu

    Follow us on

    Getup Srinu : గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న ‘ రాజు యాదవ్ ‘ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీను పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కేవలం డబ్బు కోసం జబర్దస్త్ కమెడియన్స్ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు అని .. వారి చేతికి భారీ మొత్తంలో ముట్టిందని న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో శ్రీను క్లారిటీ ఇచ్చాడు.

    గత ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలని పవన్ కళ్యాణ్ చాలా శ్రమిస్తున్నారు. ఆయన్ని గెలిపించాలని మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ గ్రూప్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రాంప్రసాద్ వంటి వారు జనసేన తరపున ప్రచారానికి దిగారు.

    పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటూ పిఠాపురంలో రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్స్ డబ్బులు తీసుకుని ప్రచారం చేస్తున్నారట. దాదాపు రెండు కోట్లు జనసేన వాళ్లకు చెల్లించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై శ్రీను స్పందించాడు. డబ్బులు తీసుకుని పిఠాపురంలో ప్రచారం చేస్తున్నాము అన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నాడు.

    పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానంతో, ఆయన గెలిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అని ప్రచారం చేస్తున్నాము. మీకు సందేహం ఉంటే మా బ్యాంకు అకౌంట్స్ వివరాలు ఇస్తాము. చెక్ చేసుకోండి అని ఛాలెంజ్ చేశాడు. రోజా కామెంట్స్ పై స్పందిస్తూ .. మెగా ఫ్యామిలీ అంటే భయంతో ప్రచారం చేయడం లేదు. మావి చిన్న ప్రాణాలు అన్నారు. రోజా కామెంట్స్ కూడా చిన్నవిగా తీసుకుంటాము అని శ్రీను కౌంటర్ ఇచ్చాడు. నేను ఇతర హీరోలతో కూడా నటించానని ఆయన అన్నారు.