Homeఎంటర్టైన్మెంట్Krish Jagarlamudi: డ్రగ్ కేసులో సంచలన నిజాలు, పరారీలో క్రిష్... పోలీసులు ఏమన్నారంటే?

Krish Jagarlamudi: డ్రగ్ కేసులో సంచలన నిజాలు, పరారీలో క్రిష్… పోలీసులు ఏమన్నారంటే?

Krish Jagarlamudi: రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు(Radisson Drug Case) కీలక మలుపులు తిరుగుతుంది. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీ పలుమార్లు గజ్జెల వివేకానంద్ కి డ్రగ్ సప్లై చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడని సమాచారం. రాడిసన్ హోటల్ లో డ్రగ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అటాక్ చేశారు. ఈ దాడిలో కొందరు పట్టుబడగా మరికొందరు పరారీలో ఉన్నారు. ఈ పార్టీకి డ్రగ్ సప్లై చేసిన అబ్బాస్ అలీతో పాటు వివేకానంద్, కేదార్, నిర్భయ్ లను అరెస్ట్ చేశారు. ఈ పార్టీలో పాల్గొన్న దర్శకుడు క్రిష్, లిషి గణేష్, నీల్, సందీప్, రఘు చరణ్ లు పరారీలో ఉన్నారు.

వీరిలో అత్యంత ప్రముఖుడిగా దర్శకుడు క్రిష్ ఉన్నాడు. దీంతో డ్రగ్ కేసు కీలకంగా మారింది. పరారీలో ఉన్న క్రిష్ కి CrPc 160 నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ లో A -10గా క్రిష్ పేరు చేర్చినట్లు సమాచారం. క్రిష్ హాజరైన వెంటనే విచారించనున్నారు. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. క్రిష్ రక్త, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా ఆయన డ్రగ్ తీసుకున్నదీ లేనిది నిర్ధారించనున్నారు.

డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ అలీ పదిసార్లు గజ్జెల వివేకానంద్ కి డ్రగ్ సప్లై చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి నాలుగు గ్రాముల కొకైన్ సప్లై చేశాడట. రాడిసన్ హోటల్ యాజమాన్యం మీద కూడా కేసులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆ హోటల్ లో పలుమార్లు డ్రగ్ పార్టీలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.

అయితే పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను క్రిష్ ఖండించినట్లు సమాచారం. తాను విచారణకు హాజరు అవుతున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడట. క్రిష్ టాలీవుడ్ టాలెంట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. గమ్యం, వేదం వంటి చిత్రాలు ఆయనకు ఫేమ్ తెచ్చాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. కొంత మేర షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఎన్నికల అనంతరం పట్టాలెక్కనుంది.

RELATED ARTICLES

Most Popular