Pawan Kalyan: తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం జనసేన – తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “తెలుగు జన విజయకేతనం” పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తాను చేసుకున్న వివాహాలపై పదేపదే వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుండడాన్ని సహించలేక పవన్ కళ్యాణ్.. తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. “నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నానని జగన్ అంటున్నాడు. ఒకవేళ జగన్ నా నాలుగో భార్య కావచ్చు” అని పవన్ సంచలన విమర్శలు చేశారు. పవన్ ఎప్పుడైతే ఆ కామెంట్లు చేశారో జనసేన నాయకులు, టిడిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నాలుగో భార్య అని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అటు టిడిపి, ఇటు జనసేన నాయకులు తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెళ్లి సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాళి కడుతున్న హీరోయిన్ ఫేస్ లో జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చొప్పిస్తున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. “పెళ్లికి కూడా పిలవలేదు. సర్లే సర్లే ఎన్నో అనుకుంటాం. అన్నీ జరిగిపోతాయా ఏంటి. నాలుగో పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్.. రెండవ పెళ్లి చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని సుఖంగా ఉంచాలని కోరుకుంటున్నాం” అని కామెంట్లు చేస్తున్నారు. అసలే ఎన్నికల కాలం ఈ ఫోటోలను అటు టిడిపి, ఇటు జనసేన అనుకూల నెటిజన్లు తెగ సర్కులేట్ చేస్తున్నారు.
వాస్తవానికి ఇలాంటి మార్ఫింగ్ ఫోటోల సర్కులేషన్ సరైన చర్య కాకపోయినప్పటికీ.. వైసిపి ఆగడాలను ఎదుర్కోవాలంటే ఇలానే చేయాలని జనసేన నాయకులు బదులిస్తున్నారు. “ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రతి రంగంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారు. హత్యలు చేశారు. రాజధాని విషయంలోనూ అబద్ధాలు ఆడారు.. ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రానికి భవిష్యత్తు అనేది లేకుండా చేశారు. ఇలాంటప్పుడు సన్ రైజ్ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మా బాధ్యత” అని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు చేస్తున్న పనికి టిడిపి నాయకులు సంఘీభావం తెలపడం విశేషం.
పెళ్లికీ కూడా పిలవలేదు. సర్లే సర్లే ఏనేనో అనుకుంటాం, మా ఆన్న నీ బాగా చూసుకో నాలుగో వొదిన ❤️ pic.twitter.com/HwI5THxBep
— Sandhya Reddy YSCRP (@SandhyaSamayam) February 28, 2024