South Film Industry : మలయాళ సినీ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల సమస్య పట్టి పీడిస్తోంది. జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుతో కొందరు నటీమణులు తమ సమస్యలు చెప్పుకోవడానికి బయటకు వస్తన్నారు. మలయాళ ఇండస్ట్రీలో నటీమణులకు అవకాశాలు రావాలంటే వేధింపులు ఎదుర్కోక తప్పదని కొందరు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ తో సహా పలువురు సభ్యులు సంఘానికి రాజీనామా చేశారు. అయితే తాజాగా సౌత్ ఇండస్ట్రీ నటి షకీలా లైంగిక వేధింపులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో ఫేమస్ గా ఉన్న షకీలా చేసినా కామెంట్స్ తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..
షకీలా గురించి తెలియని వారుండరు. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈమె నటించిన కొన్ని సినిమాలు ఫేయస్ అయ్యారు. తెలుగులోనూ జయం, తదితర సినిమాల్లో నటించారు. అయితే గతంలో ఓ సందర్భంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆసక్తి కర కామెంట్స్ చేశారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొన్నింటిని పట్టించుకోవద్దని అన్నారు. ఆ తరువాత షకీల సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా మలయాళ ఇండస్ట్రీలో నెలకొన్నఅలజడి నేపథ్యంలో షకీలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను కూడా కొందరి నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తమిళం, మలయాళం ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొందరికి వేధింపులు తప్పవని అన్నారు. అలాగే తెలుగులోనూ కొందరు నటీమణులపై చిన్న చూపు చూశారని అన్నారు. అయితే హిందిలీ ఇలాంటి వేధింపులు ఎక్కువగా కనిపించరని షకీలా అన్నారు. ఇక్కడ ఎక్కువగా స్నేహితుల్లాగే ఉంటారని చెప్పారు. దీంతో షకీలా చేసిన కామెంట్స్ తెలుగు ఇండస్ట్రీలోనూ ఆసక్తిని రేకెత్తించాయి.
గతంలో క్యాస్టింగ్ కౌచ్ ఆధారంగా ‘మీటూ’ ఉద్యమం కొనసాగింది. ఈ యాష్ ట్యాగ్ ఆధారంగా కొందరు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగ పరిచారు. ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలోని సమస్యలపై హేమ కమిటీ ద్వారా నటీమణులు తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి బయపడుతున్నారు. అయితే ఈ సమస్య ఒక్క మలయాళంలోనే కాదని మిగతా సినీ ఇండస్ట్రీలో కూడా ఉందని నటీమణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుందోనని కొందరు అంటున్నారు.
మరోవైపు ఈ వివాదం మిగతా ఇండస్ట్రీలోకి వెళితే వేధింపులు ఎదుర్కొన్న వారు ఒక్కొక్కరు బయటపడే అవకాశం ఉంది. అయితే కొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇలా తమ విషయాలు బహిర్గతపరిస్తే ముందు ముందు అవకాశాలు ఉంటాయో లేవోనని ఆందోళన చెందుతారని చెబుతున్నారు. కానీ ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇందులో కలిసి రావాలని కోరుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఈ వివాదంపై తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరూ కామెంట్ చేయలేదు. అయితే రానున్న రోజుల్లో ఎవరైనా తమ ససమస్యలు చెప్పుకుంటారోనని చూడాలి.