Harihara Veeramallu: కొండపొలం సినిమా పరాభవం తర్వాత దర్శకుడు క్రిష్ మౌనవ్రతం లోకి జారుకున్నారు. కొండపొలం ప్లాప్ క్రిష్ కి పూర్తి నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఆ నిరుత్సాహం ఆయన్ని ఇంకా వీడలేదు అనుకుంటా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా పనుల్లో మునిగి పోయినప్పటికీ.. కొండపొలం నష్టాలే పదే పదే గుర్తుకొస్తున్నాయి. అందుకే పవన్ హరిహర వీరమల్లు సినిమా విషయంలో క్రిష్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సినిమా బిజినెస్ వ్యవహారాల్లో కాలు చేతులు పెట్టి ఇరుక్కుపోకూడదు అని ఫిక్స్ అయ్యాడు.

కొండపొలం బయ్యర్లకు భరోసా ఇచ్చి.. ఆ తర్వాత వారికి వివరణ ఇవ్వాల్సి రావడం క్రిష్ కి మింగుడు పడలేదు. ఓ దశలో క్రిష్ అఫీస్ పై కూడా కొండపొలం బాధితులు ఎటాక్ చేశారు. ఈ విషయంలోనే తన పరువు కూడా దెబ్బ తిండి అని క్రిష్ బాగా ఫీల్ అయ్యాడు. అందుకే, పవన్ తో తాను చేసే హరిహర వీరమల్లు సినిమా విడుదల అయ్యేవరకూ ఈ సినిమా ప్రొడక్షన్ లో గానీ, బిజినెస్ లో గానీ క్రిష్ అస్సలు జోక్యం చేసుకోవడం లేదు.
దాంతో హరిహర వీరమల్లు సినిమా సంగతులు అన్నీ నిర్మాత ఎం రత్నం కనుసన్నుల్లోనే జరుగుతున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం రైటింగ్ టీమ్ ను కూడా పెంచాడు. కొండపొలం సినిమా వరకూ ఇద్దరు మాత్రమే క్రిష్ రైటింగ్ టీమ్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సంఖ్య 4 మందికి చేరింది. పైగా ఈ టీమ్ లో ఒకరు హిందీ నుంచి, మరొకరు తమిళం నుంచి ఉండటం విశేషం. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కథాకథనాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా రైటర్స్ ను సెట్ చేశాడు ఎం రత్నం.
పైగా ఈ సినిమా స్క్రిప్ట్ తో పాటు మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎం రత్నం ఇన్ వాల్వ్ అవుతున్నాడు. ఇక మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు సినిమా. కాబట్టి, సినిమా నేపథ్యానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. పైగా పవన్ కి ఈ సినిమాలో 3 షేడ్స్ కు సంబంధించి 3 డిఫరెంట్ గెటప్స్ ప్లాన్ చేశాడు క్రిష్.

ఒకటి వజ్రాల దొంగ వీరమల్లు గెటప్ అయితే, సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా మరో గెటప్, అలాగే దేశం కోసం పోరాడే వీరుడిగా మరో గెటప్ లో పవన్ కనిపించబోతున్నాడు. అన్నిటికీ మించి 17వ శతాబ్దం నాటి కథ కావడంతో.. పవన్ దుస్తులు, యాక్ససరీస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇలా పవన్ పాత్రలో 3 డిఫరెంట్ షేడ్స్, గెటప్స్ ఉండటంతో చాల స్లోగా సాగుతుంది షూటింగ్. ఏది ఏమైనా దసరాకి మాత్రం సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత రత్నం ప్లాన్. మరి ఏమవుతుందో చూడాలి.