https://oktelugu.com/

Senior NTR: ఈ ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టాడు… మరి ఆ ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టిన హీరో ఎవరో తెలుసా? సేమ్ సీన్!

ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్-రామ్ చరణ్ మధ్య ఓ అద్భుతమైన సీన్ రూపొందించాడు రాజమౌళి. ఎన్టీఆర్ ని రామ్ చరణ్ కొరడాతో కొట్టి హింసిస్తాడు. కాగా సీనియర్ ఎన్టీఆర్ తో ఓ స్టార్ హీరో గతంలోనే ఈ తరహా సీన్ చేశాడు. ఆయన కూడా ఓ స్టార్ హీరోనే. సీనియర్ ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టిన ఆ స్టార్ హీరో ఎవరో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : November 21, 2024 / 01:24 PM IST

    Senior NTR

    Follow us on

    Senior NTR: ఈఆర్ ఆర్ ఆర్ రాజమౌళి తెరకెక్కించిన మరొక విజువల్ వండర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ విశేష ఆదరణ పొందింది. ఏకంగా రూ. 1200 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ భీమ్, రామ్ చరణ్ రామరాజు పాత్రల్లో అద్భుతం చేశారు. ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్, ప్రాధాన్యత ఉండేలా రాజమౌళి జాగ్రత్తపడ్డారు. అయితే రామ్ చరణ్-ఎన్టీఆర్ ఒకరితో ఒకరు తలపడటం సినిమాకు హైలెట్. ఈ మూవీలో గూస్ బంప్స్ రేపే సన్నివేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ”కొమరం భీముడో” సాంగ్ ఒకటి.

    బ్రిటీష్ కోటలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లేందుకు దాడి చేసిన భీమ్ పట్టుబడతాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో అధికారికగా ఉన్న రామరాజు అతనికి స్వయంగా తన చేతులతో శిక్ష విధించాల్సి వస్తుంది. బ్రిటీష్ దొర ఆదేశాల మేరకు భీమ్ ని రామరాజు కొరడాతో కొడతాడు. ఈ సీన్ కన్నీరు తెప్పిస్తుంది. పాట కూడా గుండెలను కదిలిస్తుంది. ఈ సన్నివేశంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి నటన కనబరిచారు.

    కాగా ఇదే తరహా సీన్ గతంలో చోటు చేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ ని ఓ స్టార్ హీరో కొరడాతో కొట్టాలి. ఆ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్-కృష్ణ కలిసి నటించారు. వీ. రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. జగ్గయ్య మెయిన్ విలన్ రోల్ చేశాడు. విజయనిర్మల, జయలలిత, ఎస్వీఆర్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు.

    ఈ మూవీలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ ని ఓ స్తంభానికి బంధిస్తారు. అప్పుడు కృష్ణ ఎన్టీఆర్ ని కొరడాతో కొట్టాలి. ఎన్టీఆర్ టాప్ హీరో, కృష్ణ సైతం స్టార్ గా వెలుగొందుతున్నారు. దాంతో ఎన్టీఆర్ అభ్యంతరం చెప్పారట. మీరు నన్ను కొరడాతో కొడితే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. జూనియర్ ఆర్టిస్ట్ తో చేయించండి అన్నారట. దాంతో జూనియర్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ ని కొరడాతో కొడతాడు. చివర్లో కృష్ణ కొట్టబోతుంటే ఎస్వీఆర్ వచ్చి అడ్డుకుంటాడు. అలా ఆ సీన్ కి న్యాయం చేశారట.