https://oktelugu.com/

Young Directors: ఈ యంగ్ డైరెక్టర్స్ లో మొదట 2000 కోట్ల కలెక్షన్స్ ను రీచ్ అయ్యే దర్శకుడు ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటుడు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఎందుకంటే ఒకసారి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటే ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడమే కాకుండా రెమ్యూనరేషన్ పరంగా కూడా తను చాలా ఉన్నతమైన రేంజ్ లో రెమ్యూనరేషన్ ను అందుకునే అవకాశాలు కూడా దక్కవచ్చనే ఉద్దేశ్యం తో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు... అయితే కొందరికి మంచి అవకాశాలు వస్తే మరికొందరికి మాత్రం ఆశించిన అవకాశాలు దక్కకపోవచ్చు..

Written By:
  • Gopi
  • , Updated On : November 21, 2024 / 01:18 PM IST

    Young Directors

    Follow us on

    Young Directors: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక దానికి తోడుగా ఈ ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లందరు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే తమదైన రీతిలో స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న ఈ దర్శకులు పాన్ ఇండియాలో 2000 కోట్ల కలెక్షన్లను సంపాదించడానికి విపరీతమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్, సుజీత్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు 2000 కోట్ల మార్కును అందుకోవడానికి విపరీతమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తమ రాబోయే సినిమాలతో 2000 కోట్ల మార్కును దక్కించుకొని ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్లుగా కొనసాగే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నలుగురిలో ఎవరికి ఆ మార్కు ను ఈజీగా సంపాదించే అవకాశం ఉందని కొన్ని రకాల చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్ కి ఈ మార్క్ ఈజీగా దక్కించుకునే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక వీళ్లిద్దరూ కూడా ఇప్పుడు ప్రభాస్ తోనే సినిమాలు చేస్తున్నారు. కాబట్టి సినిమాలో కొంచెం వైవిధ్యాన్ని ప్రదర్శిస్తే మాత్రం వీళ్ళిద్దరూ రెండు వేల కోట్ల మార్కును ఈజీగా దక్కించుకోవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మిగిలిన ఇద్దరు దర్శకులు కూడా మరికొన్ని సినిమాలు చేసిన తర్వాత వాళ్లు ఈ మార్క్ ని ఈజీగా అందుకునే అవకాశాలైతే ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమా దాదాపు 900 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు.

    ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ని సరికొత్త అవతారంలో చూపిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా ఈజీగా రెండువేల కోట్ల మార్క్ ను దక్కించుకుంటుందనే వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇక దీనికి తోడుగా నాగ్ అశ్విన్ లాంటి యంగ్ డైరెక్టర్ కల్కి సినిమాతో 1200 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు.

    ఇక ఇప్పుడు కల్కి 2 సినిమాతో మరోసారి ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ దర్శకుడు కూడా తొందర్లోనే 2000 కోట్ల మార్కును అందుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విధానం అయితే చాలా కొత్తగా ఉంది…