Senior Heroine Radha: వెండితెర పై ఆ రోజుల్లో.. అనగా ఇరవై ఐదేళ్ల క్రితం.. ఆమె తన అందంతోనూ, అభినయంతోనూ అద్భుతంగా మెప్పించింది. ఒకప్పటి అగ్ర కథానాయకులైన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ష, నాగార్జున, ఇలా ఆమె అందరితో ఆడిపాడింది. ఆమెను చూడడానికి ప్రేక్షకులు కూడా థియేటర్స్ దగ్గర బారులు తీరేవారు. అది ఆమె గతం.. ఇంతకీ ఆమె ఎవరు అంటే.. అందాల ‘రాధ’.

ఈ సీనియర్ హీరోయిన్ ఓ టీవీ ఛానెల్ లో జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న సూపర్ క్వీన్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించడానికి రెడీ అయింది. పైగా ఈ విషయాన్ని రాధ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘చాలా సంవత్సరాల తర్వాత ఓ రియాలిటీ షోకు నేను జడ్ట్ గా వ్యవహరించబోతున్నాను. నేను మళ్ళీ ఇలా మీ ముందుకొస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
Also Read: రాబోయే ఎన్నికల్లో ‘గంటా’పయనమెటు?
ఇక నా సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరించబోతున్నాడు. నేను ఇలా ఓ రియాలిటీ షోకు జడ్ట్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ షోలో నేను ప్రతి నిమిషాన్ని ఎంతో ఆస్వాదిస్తాను’ అంటూ రాధ తన ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఎప్పుడో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రాధ, ఇప్పుడు ఇలా ఒక రియాలిటీ షోకు జడ్ట్ గా మళ్ళీ ఇంతకాలానికి ప్రేక్షకుల ముందుకు రావడం తో ప్రేక్షకులు కూడా ఈ షో పై ఆసక్తి చూపిస్తున్నారు. రాధ అభిమానులకు ఇది ఎంతో ఆనందాన్ని ఇచ్చే అంశమే.
Also Read: వైసీపీ మంత్రులతో మాట్లాడుతా.. ఏపీ సినిమా థియేటర్ల సమస్యలపై తలసాని కామెంట్స్..