Homeఎంటర్టైన్మెంట్Yamuna: పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలే ఇస్తానన్నారు :యమున

Yamuna: పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలే ఇస్తానన్నారు :యమున

Yamuna: తొలి సారి దర్శకుడు బాలచందర్​ సినిమాలో కనిపించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా తన ప్రతిభ కనపరుస్తున్న నటి యమున. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన సినీ కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలచందర్​ సినిమా తర్వాత సరైన అవకాశాలు రాలేదని అన్నారు పొట్టిగా ఉన్నానని చిన్న పాత్రలు మాత్రమే ఇస్తామని అన్నట్లు పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం హీరోయిన్​ అవుతానని పట్టు పట్టుకొని కూర్చున్నట్లు యమున వివరించారు. ఆ తర్వా తన నటన చూసి మౌనపోరాటంలో ఛాన్స్ ఇచ్చారని.. కాస్త ఇబ్బంది అనిపించినా.. ఆ సినిమాలో బ్లౌజ్​ లేకుండా నటించినట్లు వెల్లడించారు.

ఆ తర్వాత తనకు ఫైర్​ బ్రాండ్​ అనే పేరు రావడానికి గల కారణాలను వివరిస్తూ. కోపమొచ్చినా, సంతోషమొచ్చినా వెంటనే చూపించే తత్వం తనదని పేర్కొన్నారు. దానివల్లే తనకు ఫైర్​ బ్రాండ్​ అనే ఇమేజ్​ వచ్చిందని తెలిపారు.  చిరంజీవితో ‘కొదమ సింహం’, మోహన్‌బాబుతో ‘అల్లుడుగారు’, బాలకృష్ణతో ఓ సినిమా, రాజశేఖర్, శరత్‌కుమార్, మోహన్‌లాల్‌లతో ఇలా చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయినట్లు యమున తెలిపారు. ప్రస్తుతం సీరియల్స్​లో బిజీగా ఉన్నందుకు హాపీగానే ఉన్నట్లు చెప్పారు.

కాగా, ఎవరెవరో ఫొటోలను చూపిస్తూ.. తన భర్త అంటూ సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారని.. అలా చేయొద్దని కోరారు యమున. తను పెళ్లి చేసుకున్నది ఒక్కరినే అని నవ్వుతూ సమాధానమిచ్చారు. కావాలంటే ఫ్యామిలీ ఫొటోలు పంపిస్తానని చెప్పింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version