Mega Family: మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ “సూపర్ మచ్చి”… టీజర్ రిలీజ్

Mega Family: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంత మండి హీరోలుగా వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలోనే చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. “విజేత” సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ మోవిఎతో విజేత కాలేదనే చెప్పాలి. ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే కళ్యాణ్ ఆ తర్వాత ఇప్పటి వరకు […]

Written By: Raghava Rao Gara, Updated On : November 4, 2021 5:51 pm
Follow us on

Mega Family: మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంత మండి హీరోలుగా వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈ తరుణంలోనే చిరంజీవి చిన్న కూతురు భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. “విజేత” సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ మోవిఎతో విజేత కాలేదనే చెప్పాలి. ఆ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర అలరించలేకపోయింది. ఈ తరుణంలోనే కళ్యాణ్ ఆ తర్వాత ఇప్పటి వరకు వేరే సినిమా చేయలేదు. అయితే తాజాగా వరుస సినిమాలతో తన సత్తా చాటెందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో తాజాగా కళ్యాణ్ నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా నుంచి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. టీజర్ లో కాయన్ దేవ్ నటనలో మెరుగుపడ్డట్టు కనబడుతున్నాడు. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ చూస్తుంటే మూవీ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. దీపావళి కానుకగా ఈ చిత్ర  టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. సూపర్ మచ్చి చిత్రానికి పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్  పతాకంపై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగుతమ్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో రచితా రామ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే రాజేంద్రప్రసాద్, నరేష్‌, ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా మంచి వ్యూస్ సంపాదిస్తుంది.