Ameesha Patel: బాలీవుడ్ భామ ‘అమీషా పటేల్’ అప్పట్లో బోల్డ్ సీన్స్ తో స్టార్ హీరోయిన్ అయింది. ఈ మధ్య అమీషాకి కాలం కలిసి రావడం లేదు. ఎలాగూ సినిమా ఛాన్స్ లు లేవు. దాంతో సైడ్ బిజినెస్ గా బోటిక్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ముంబైలో మొదలు పెట్టిన ఈ బిజినెస్ బాగానే నడిపింది. కానీ తన దగ్గర పనిచేస్తున్న ఓ మేనేజర్ ఆమెను మోసం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె కేసు కూడా పెట్టాలనుకుంటుంట.

అమీషా మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వస్తోంది. అయితే మధ్యలో కొన్నాళ్ళు సోషల్ మీడియాకి గ్యాప్ ఇచ్చింది. ఆ సమయంలోనే బిజినెస్ వ్యవహారాల్లో బాగా బిజీగా ఉందట. అయినా అమీషా ఎంత బిజీగా ఉన్నా.. ముఖ్యంగా హీరోయిన్ గా ఉన్న సమయంలోనే సోషల్ మీడియా పై తన గ్లామర్ తో విరుచుకు పడేది.
అలాంటి అమీషా ఇప్పుడు నష్టాల్లో ఉంది. పైగా ఖాళీగా ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో ఈ బాలీవుడ్ ముదురు భామకు ఛాన్స్ లు కావాలి. అందుకే, ప్రస్తుతం సైలెంట్ గా ఛాన్స్ ల కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతల చుట్టూ తిరుగుతుంది. కొత్త భామల రావడంతో భారీ కాంపిటీషన్ మధ్య అమీషాకు ప్రస్తుతం ఒక్క సినిమా కూడా రావడం లేదు.
దీనికితోడు అమీషా ఆ మధ్య నిర్మాతగా మారి ఒక సినిమాని మొదలుపెట్టింది. కానీ బడ్జెట్ సమస్యలతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆమె పై చీటింగ్ కేసు కూడా పెట్టారు ఆమె సహా నిర్మాతలు. మొత్తానికి ప్రస్తుతం అమీషా పీకల్లోతు కష్టాల్లో ఉంది. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె ప్రయత్నాలు చేస్తోంది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అమీషాకు ఎవ్వరూ ఆఫర్స్ ఇవ్వట్లేదు.
Also Read: Pushpa Movie: “పుష్ప” సినిమాలో ఓ పాట కోసం ఎంతమంది డాన్స్ వేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…
కారణం.. బాలీవుడ్ నిండా ప్రస్తుతం ముదురు భామలు ఎక్కువైపోయారు. లేటు వయసులో కూడా బోల్డ్ ఫోజులు ఇస్తూ మాజీ హీరోయిన్లు రోజురోజుకూ ఛాన్స్ ల కోసం పోటీ పడుతున్నారు. ఆ పోటీలో అమీషా పటేల్ వెనుక పడింది. ఆమెకు ఛాన్స్ లేకుండా పోయింది. అన్నిటికీ మించి బిజినెస్ లోనూ మోసపోయింది.
Also Read: మెగాస్టార్ తో ఏమి చేస్తాడు ? అప్పుడే నెగిటివ్ ప్రచారం !