Homeఎంటర్టైన్మెంట్సీనియర్ హీరోకి దేవుడు పట్టాడు !

సీనియర్ హీరోకి దేవుడు పట్టాడు !


తెలుగు సీనియర్ హీరోల్లో ఒక హీరో ఉన్నాడు. మొదటి నుండి కాస్త దేవుడి పట్ల భయం భక్తి ఉన్నవాడు. పైగా భక్తి పుస్తకాలు కూడా ఎక్కువగా చదువుతాడు. దేనికయ్యా ఈ భక్తి అని ఎంతమంది కామెంట్స్ చేసినా ఆయన తీరు మారలేదు. అయితే మరో సీనియర్ హీరోలా పూజలు ముహూర్తం వంటి అలవాట్లు ఈ హీరోకి లేవు. కాకపోతే ఈ మధ్య ఈయనకు ఒక అలవాటు వచ్చి పడింది. కనిపించిన ప్రతి ఒక్కరికి తనదైన శైలిలో ప్రవచనం చెబుతున్నాడట. సహజంగా అందరికీ దూరంగా ఉండే ఈ హీరో వయసు మీద పడేకొద్ది కాస్త మనుషులతో మమేకం అవుతున్నాడు.

Also Read: క్రిష్’ బ్యాడ్ లక్.. పవర్ స్టార్ తోనే మూడేళ్లు

అయితే అయ్యాడు. ఇప్పుడు ఉన్నట్లు ఉండి ఈ భక్తి ప్రవచనాల గోల ఏందిరా బాబు అని ఆ హీరో తాలూకు సన్నిహితులు చాటుగా గుసగుసలాడుతున్నారు. అన్నట్లు ఈ హీరోగారి ప్రవచనం గురించి ఫిల్మ్ నగర్ లోని కుర్ర డైరెక్టర్లు ఇలా మాట్లాడుకుంటూ కామెడీ చేసుకుంటున్నారు. హీరోగారి మాటల్లో.. ఏ మనిషి అయినా తన లైఫ్ ను ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. దేవుడు బాధ్యతలను గుర్తు చేసి డబ్బు మీద ఆశను పుట్టిస్తాడట. డబ్బు మోజులో పడి జీవితాన్ని కోల్పోతుంటే ఆరోగ్యం జాగ్రత్త అని ఏదొక సమస్య ఇచ్చి మనల్ని మనకు గుర్తు చేస్తాడట. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి దేవుడు ఉన్నాడనుకున్నప్పుడు.. మొహం చాటేస్తాడట.. అదే దేవుడు అట.. పిల్లల భవిష్యత్తు కోసం మనం డబ్బు వెంట పరిగెడితే, మన వెంట పరిగెడతాడు. అది చూసి మనం దేవుడు ప్రేమని కోరుకుంటున్నట్లు మనం ఆయన వెంట పడితే.. నిన్ను నువ్వు చూసుకో అని గుర్తు చేస్తాడు. మొత్తానికి ఇలా అన్ని పుస్తకాల్లోని సారాన్ని మొత్తం కలిపేసి దేవుడు గురించి ఆ హీరోగారు ఏదేదో చెబుతున్నాడట.

Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

పాపం చదివితే ఉన్న మతి పోయినట్టు ఈ హీరోగారు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన సన్నిహితులు బాధ పడుతున్నారు. ఈ కరోనా వచ్చినప్పటి నుండే హీరోగారిలో ఈ గోల ఎక్కువైందట. ఎవరు మాత్రం ఏమి చేయగలరు. ఎవరి భవిష్యత్తు అయినా దేవుడి చేతిలోనే ఉంటుందని చాలామంది నమ్మకం. మరి ఆ దేవుడి ఆలోచనలో గడుపుతున్న ఈ సీనియర్ హీరో భావవ్యక్తీకరణకి ఆ దేవుడు హీరో భవిష్యత్తును ఏమి చేయకుండా ఉంటే అదే పదివేలు అనుకోవాలి ఇక.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version