https://oktelugu.com/

హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రముఖులు గళం విప్పుతున్నారు. కంగన రనౌత్‌, తాప్సీతో పాటు పలువురు దర్శక నిర్మాతలు తామకు ఎదురైన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. తాజాగా అలనాటి మేటి హీరోయిన్‌.. 90ల్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిసిన సీనియర్ నటి రవీనా టాండన్‌ దీనిపై స్పందించింది. ఫిల్మ్‌ మాఫియాపై సంచలన కామెంట్లు చేసింది. చెప్పినట్టు వినలేదని, మంచం మీదకు రాలేదని చాలా మంది హీరోలు, వాళ్లకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 5, 2020 6:59 pm
    Follow us on


    సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజానికి వ్యతిరేకంగా అనేక మంది ప్రముఖులు గళం విప్పుతున్నారు. కంగన రనౌత్‌, తాప్సీతో పాటు పలువురు దర్శక నిర్మాతలు తామకు ఎదురైన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. తాజాగా అలనాటి మేటి హీరోయిన్‌.. 90ల్లో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిసిన సీనియర్ నటి రవీనా టాండన్‌ దీనిపై స్పందించింది. ఫిల్మ్‌ మాఫియాపై సంచలన కామెంట్లు చేసింది. చెప్పినట్టు వినలేదని, మంచం మీదకు రాలేదని చాలా మంది హీరోలు, వాళ్లకు చంచాలుగా వ్యవహరించిన జర్నలిస్టులు తనను వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసింది.

    Also Read: క్రిష్’ బ్యాడ్ లక్.. పవర్ స్టార్ తోనే మూడేళ్లు

    మనం 90ల్లోని బాలీవుడ్‌ హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే రవీనా టాండన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కామెడీ,డ్రామా, యాక్షన్ ఇలా అన్ని రకాల చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుందామె. కానీ ఈ రహదారి తనకు అంత సులభం కాదని ఆమె వెల్లడించింది. బంధుప్రీతి, హీరోయిన్లపై వేధింపులు, ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం ప్రదర్శించే పెద్దలు, కొన్ని వర్గాలు తమ మాట వినని యాక్టర్లను టార్గెట్‌ చేయడం ఇప్పుడే కాదని 90ల్లో కూడా ఉందని రవీనా చెప్పింది. ఆ టైమ్‌లో అమ్ముడుపోయిన జర్నలిస్టులు కొందరికీ తొత్తులుగా మారి ఎవ్వరి అండలేని తన లాంటి వాళ్లను ఎంతగానో బాధ పెట్టారని చెప్పింది.

    బాలీవుడ్‌లో కొన్ని ముఠాలు, మేల్ యాక్టర్లు, కొందరు హీరోయిన్లు, వాళ్ల చంచా జర్నలిస్టులు తనను ఎలా వేధించారో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా వివరించింది. కొంత మంది హీరోలు చెప్పినట్టు వినకపోవడం, వాళ్ల పక్కలో పడుకోవడానికి నిరాకరించడంతో తనకు అఫైర్లు అంటగట్టడంతో పాటు సినిమాల నుంచి తప్పించే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోన్నానని చెప్పింది. తన కెరీర్ను అంతం చేయాలని చాలా మంది ప్రయత్నించినా.. వాటి నుంచి బయట పడ్డానని తెలిపింది.

    Also Read: చైతు ‘లవ్ స్టోరీ’కి కొత్త కష్టం !

    ‘ఈ ముఠాల్లో హీరోలు, వారి గర్ల్ ఫ్రెండ్స్‌తో పాటు వారి చంచా జర్నలిస్టులు ఉండేవాళ్లు. ఇందులో నన్ను షాక్‌కు గురిచేసిన విషయం ఏంటంటే, ఈ ముఠాలోని మహిళా జర్నలిస్టులే సాటి మహిళల కెరీర్ను నాశనం చేశారు. ఇప్పుడైతే మేము స్త్రీవాదులం, అల్ట్రా -ఫెమినిస్ట్ కాలమ్స్‌ రాస్తున్నామని వాళ్లు గొప్పలు చెప్పుకుంటుంటే నాకు నవ్వొస్తోంది. గతంలో వాళ్లు నాకెప్పుడూ అండగా నిలబడలేదు. ఎందుకంటే నాపై బురద చల్లితే హీరో వారికి డబ్బుల కవర్లు ముట్టజెప్పేవాళ్లు. ఆ సమయంలో పూర్తిగా గుత్తాధిపత్యం నడిచింది. నిజాయితీగా ఉండడంతో ఆ టైమ్‌లో నేను సినిమాలు కోల్పోలేదు గానీ నా గురించి చాలా తప్పు వార్తలు రాశారు. ఇండస్ట్రీలో నాకు గాడ్‌ఫాదర్స్ లేరు. ఆ ముఠా క్యాంపుల్లో నేను భాగం కాలేదు. నన్ను ప్రోత్సహించే హీరోలు లేరు. నేను పాత్రల కోసం హీరోలతో పక్క పంచుకోలేదు. వారితో అఫైర్లు పెట్టుకోలేదు. చాలా సందర్భాల్లో నాపై అహంకారి అనే ముద్ర వేశారు. ఎందుకంటే హీరోలు నా గురించి ఏం అనుకున్నా పట్టించుకోలేదు. వాళ్లు నవ్వమన్నప్పుడు నవ్వడం, కూర్చోమన్నప్పుడు కూర్చోవడం నాకు చేతకాలేదు. నాకు ఇష్టమైన పనులే చేశా. ఆత్మాభిమానంతో బ్రతికా. కానీ, ఆశ్చర్యకరంగా మహిళా జర్నలిస్టులే నన్ను కిందకు లాగడానికి ప్రయత్నించారు. అయినా సరే నాకు నచ్చినట్టు నేను జీవించాలనుకున్నా’ అని రవీనా చెప్పుకొచ్చింది.