Ram Pothineni Boyapati Movie Teaser: ‘అఖండ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను యంగ్ హీరో రామ్ తో ఒక సీనియా చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలం నుండి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటించింది. ఇక నేడు రామ్ పుట్టిన రోజు సందర్భంగా కాసేపటి క్రితమే టీజర్ ని విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది.
ఈ టీజర్ లో రామ్ చాలా లావువ కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం తో ఊర మాస్ లుక్ లో రామ్ ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక ఈ టీజర్ లో రామ్ చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. ఆయన డైలాగ్స్ మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసిన విధంగా ఉన్నట్టుగా అనిపించింది.
‘నీ స్టేట్ దాటలేను అన్నావ్..డాటా..నీ గేట్ దాటలేను అన్నావ్..డాటా..నీ పవర్ దాటలేను అన్నావ్..డాటా..ఇంకేమి దాటాలి నా బొంగులో లిమిట్స్’ అంటూ రామ్ చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ కి తగ్గ హీరోయిజం ని చూపిస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్ కి సరిగ్గా సరిపోయే విధంగా బోయపాటి శ్రీను ఈ క్యారక్టర్ ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ టీజర్ లో రామ్ చెప్పిన డైలాగ్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టు గా అనిపిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు.
గతం లో విజయవాడ లోని తన మామయ్య హాస్పిటల్స్ పై ప్రభుత్వం వ్యవహరించిన తీరుని రామ్ ప్రశ్నించాడు. అవి మనసులో పెట్టుకొనే ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా డైలాగ్స్ పెట్టించుకున్నాడు అని సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, ఈ డైలాగ్ తో సినిమా మీద హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
