Senior directors re-entering the industry
Senior Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించిన స్టార్ డైరెక్టర్స్ అందరూ ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోయారు. నిజానికి వీళ్ళందరూ కూడా మంచి సినిమాలు చేసి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారే కావడం విశేషం…అయితే చాలా మంది అప్డేట్ అవుతున్న సినిమాలకు తగ్గట్టుగా సినిమాలు చేయలేక ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయారు.
కానీ ఇప్పుడు మరోసారి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక ముందుగా వైవిఎస్ చౌదరి(YVS Chowdary) గురించి చూసుకుంటే ఈయన ఒకప్పుడు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, సీతయ్య, దేవదాసు లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నారు.అయినప్పటికీ ఆయన సాయి ధరమ్ తేజ్ తో చేసిన రేయ్ సినిమాతో ఒక్కసారిగా భారీ డిజాస్టర్ ను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోయారు.
బి గోపాల్(B Gopal)
బాలయ్య బాబు చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఈయన ఆ తర్వాత చేసిన సినిమాతో ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఆయన ఫేయిడ్ ఔట్ అయిపోయారు. ఇక మరోసారి సూపర్ సక్సెస్ ని అందుకోవడానికి మరోసారి కొత్త ప్రాజెక్టుతో మన ముందుకు రాబోతున్నారు…
Also Read: Balakrishna: కవల పిల్లలం.. హీరో విశ్వక్ సేన్ కు అందరి ముందే షాక్ ఇచ్చిన బాలయ్య…
గుణశేఖర్(Gunasekhar)
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి సినిమాలతో సక్సెస్ లను సాధించిన ఈయన ఇండస్ట్రీ లో తన పేరును మారూమ్రోగి పోయేలా చేసిన గుణశేఖర్ ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆయన కరెక్ట్ గా కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చాడు. అయితే గత సంవత్సరం శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మారింది. ఇక ఇప్పుడు యూఫోరియా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు…
Also Read: Fahad Fazil : పుష్ప విలన్ కి ఆ వ్యాధి సోకిందా… స్వయంగా చెప్పి షాక్ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్!
విజయ భాస్కర్(Vijaya Bhaskar)
ఒకప్పుడు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి,మన్మధుడు లాంటి క్లాసికల్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన విజయభాస్కర్..ఆయన నుంచి త్రివిక్రమ్ వేరైపోవడంతో ఆయనకి అనుకున్నంతగా సక్సెస్ అయితే రాలేదు. కాబట్టి ఇప్పుడు మరోసారి ఒక కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చే ప్రయత్నమైతే చేస్తున్నాడు…ఇక ఒకప్పటి సినీ డైరెక్టర్లందరూ ఇప్పుడు మళ్ళీ మెగాఫోన్ పట్టడం అనేది నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విషయం అనే చెప్పాలి…