Homeక్రీడలుHardik Pandya Divorce: హార్దిక్ - నటాషా విడాకుల్లో.. ఫ్యూజ్ లు ఔట్ అయిపోయే వార్త...

Hardik Pandya Divorce: హార్దిక్ – నటాషా విడాకుల్లో.. ఫ్యూజ్ లు ఔట్ అయిపోయే వార్త ఇది.. వెర్రి వాళ్లను చేశారు కదరా..

Hardik Pandya Divorce:ఆ మధ్య పూనం పాండే అనే ఓ నటి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ తో చనిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి తెలుసు కదా.. చివరికి మీడియా కూడా ఆ వార్తలను ప్రముఖంగా ప్రచురించింది. ఆ మరణం వెనుక ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా.. చాలామంది సంతాపం ప్రకటించారు. కానీ, చివరికి అదంతా ఫేక్ అని తేలింది.. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్టు నాటకం ఆడానని.. ఎవరూ దీనిని వేరే విధంగా అనుకోవద్దని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై ఆమె అవగాహన ఎలా ఉన్నప్పటికీ.. ఆమె చేసిన సోషల్ ప్రచారం మాత్రం జనాలకు చిరాకు తెప్పించింది.. దీంతో నెటిజన్లు ఆమెను ఏకిపారేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ఆమె బయటికి రావడమే మానేసింది. అయితే ఇలాంటి ట్విస్ట్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా , నటాషా విడాకుల విషయంలోనూ జరిగిందా? సోషల్ మీడియాలో హైట్ రావడం కోసం వారు జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది ఐపిఎల్ సీజన్లో గుజరాత్ జట్టు రన్నరప్ గా నిలిచింది. అంతకుముందు సీజన్లో విజేతగా ఆవిర్భవించింది. ఈ రెండు ఘనతల వెనుక హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది గుజరాత్ జట్టు నుంచి ముంబై హార్దిక్ పాండ్యాను తీసుకుంది. తన జట్టుకు కెప్టెన్ గా నియమించింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు పెద్దగా రాణించలేకపోయింది. లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. దీంతో హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇది ఇలా ఉండగానే హార్దిక్ పాండ్యా నటాషాకు విడాకులు ఇచ్చాడని, భరణం కింద 70% ఆస్తులు బట్వాడా జరిగిపోయాయని ప్రచారం జరుగుతోంది. ఈ విడాకులపై అటు హార్దిక్ పాండ్యా, ఇటు నటాషా నోరు విప్పలేదు. అయినప్పటికీ ఈ విడాకులకు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది.

హార్దిక్ పాండ్యాతో నటాషా విడాకులు తీసుకుందని, దిశాపటాని మాజీ బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో లివిన్ తో రిలేషన్షిప్ ప్రారంభించిందని.. సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇలా జరుగుతుండగానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రం తెగ వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.. ” రెడ్డిట్” లో ఆ పోస్టు ట్రెండింగ్ అవుతున్నది. ఈ పోస్టు ప్రకారం మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం.. ” హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్నారని వస్తున్న వార్తలు ప్రచారం కోసం చేస్తున్నవట. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా, ఆటగాడిగా ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోవడంతో.. దీంతో అందరి దృష్టి మళ్లించేందుకు నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్టు తెరపైకి ఒక వదంతిని తీసుకొచ్చాడట. అభిమానుల కోపాన్ని తగ్గించేందుకే ఇలా ప్రణాళిక రూపొందించాడని.. ఈ క్రమంలోనే హార్దిక్, నటాషా విడాకుల గురించి మాట్లాడలేదని ఆ పోస్టులో కనిపిస్తోంది. ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. జనాలను వెర్రి వాళ్లను చేస్తున్నారని మండిపడుతున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular