యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తున్నాడు. ఇదే మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కరోనాతో వాయిదా పడింది. ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న సమయంలోనే తన తదుపరి చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన అధికార ప్రకటనను చిత్రయూనిట్ వెల్లడించింది.
Also Read: మహేశ్ బాబు గ్లామర్ రహస్యం తెలిసిపోయింది?
ఎన్టీఆర్ సినిమాల్లో చెప్పే డైలాగులకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అలాగే మాటల మాంత్రికుడిగా దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా భారీ విజయం సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ భారీ విజయంతో వీరిద్దరికి మంచి రిలీఫ్ ఇచ్చింది. దీంతో వీరిద్దరిది సక్సస్ కాంబినేషన్ గా మారింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ వస్తుందని అభిమానులు ఆశించారు.
ఇటీవలే త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అలవైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తూనే త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి ‘అయినను హస్తినకు పోయిరావలే’ టైటిల్ పరిశీలనలో ఉందట. ఎన్టీఆర్ 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
Also Read: ‘రింగు’లోకి వస్తున్న విజయ్ దేవరకొండ..!
ఇటీవల త్రివిక్రమ్ సినిమాల్లో ఓ లేడి స్టార్ బెంచ్ మార్క్ రోల్ చేయడం కామన్ అయిపోయింది. ఈ మూవీలోనూ అలాంటి ఓ స్పెషల్ రోల్ ను దర్శకుడు త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’లో శివగామిగా అలరించిన రమ్యకృష్ణ తాజాగా ఎన్టీఆర్ మూవీలో మరో పవర్ రోల్ చేసేందుకు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై చిత్రబృందం త్వరలోనే క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.