Kalki 2 casting updates: ‘బాహుబలి’ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నటుడు ప్రభాస్… అప్పటినుంచి ఇప్పటివరకు వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ ని తన వైపు తిప్పుకుంటున్నాడు. బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ప్రభాస్ కి డై హార్ట్ అభిమానులుగా మారిపోయారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తుండడం విశేషం… సలార్, కల్కి లాంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బాస్టర్లను అందుకున్న ఆయన 2026 సంక్రాంతి కానుకగా రాజాసాబ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు…ఇక సందీప్ వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ లో పాల్గొనడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ప్రభాస్ వచ్చే సంవత్సరం వరుస సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో చేసిన కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. కాబట్టి దీనికి సీక్వెల్ గా ‘కల్కి 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ అయ్యాడు… అయితే గతంలో ‘కల్కి 2’ సినిమా నుంచి దీపికా పదుకొనే ను తీసేస్తున్నట్టు వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మరి ఆమె పాత్ర కల్కి 2 లో కీలకంగా మారబోతుంది.
అలాంటి దీపిక ను ఎందుకు తీసేసారు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆమె ఎక్కువగా రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తూ భారీ కండిషన్స్ పెడుతుండడం వల్లే ఆమెను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మరి ఆమె ప్లేస్ లో నటించే హీరోయిన్ ఎవరు అనేదానిమీద చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఎట్టకేలకు దర్శకుడు నాగ్ అశ్విన్ దీపిక పదుకొనె ను రీప్లేస్ చేస్తూ మరో హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దీపిక పదుకొనె కు బదులు ప్రియాంక చోప్రాను ఈ క్యారెక్టర్ లో తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తోంది…
ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ సినిమా తో ప్రియాంక చోప్రా కి మంచి ఇమేజ్ ఏర్పడుతుందనే ఉద్దేశ్యంతోనే తనను కల్కి 2 సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక కల్కి 2 సినిమా షూటింగ్ 2026 ఎండింగ్ లో స్టార్ట్ అవ్వబోతోంది. అప్పటివరకు ఆమె రాజమౌళి సినిమాను పూర్తి చేసి ‘కల్కి 2’ సినిమా మీద తన పూర్తి ఫోకస్ కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…చూడాలి మరి దీపిక పదుకొనే ప్లేస్ ని తను రీప్లేస్ చేసి ప్రేక్షకులను మైమరిపింపజేస్తుందా? లేదా అనేది…