Kuberaa Box Office Collection: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఒక సినిమాకి ఈ రేంజ్ పాజిటివ్ టాక్ రావడం దీనికే జరిగింది. ధనుష్(Dhanush), అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత వీళ్లిద్దరికీ కమర్షియల్ గా మంచి సక్సెస్ వచ్చింది. ధనుష్ గత చిత్రాలు కూడా సక్సెస్ అయ్యాయి కానీ , ఈ రేంజ్ పాజిటివ్ రెస్పాన్స్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. ఇక నాగార్జున సంగతి తెలిసిందే. గత కొంతకాలం గా ఆయన జీరో షేర్ సినిమాలు, సింగిల్ డిజిట్ షేర్ ఉన్న సినిమాలకు మాత్రమే పరిమితమయ్యారు. అలాంటి నాగార్జున ఈ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: మహేష్ బాబు చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో వాళ్ల అక్క మంజుల నటించాల్సిందా.?
విడుదలై రెండు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 75 లక్షలు (GST తో కలిపి) షేర్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు అయితే ఏకంగా మొదటి రోజు కంటే ఎక్కువగా 7 కోట్ల 21 లక్షలు(GST తో కలిపి) షేర్ వసూళ్లు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు థియేటర్స్ లో జనాలు లేక ఇబ్బంది పడుతున్న ట్రేడ్ కి ఈ చిత్రం ఇచ్చిన జోష్ మామూలుది కాదు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కాసుల కనకవర్షం కురిపిస్తుంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 26 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 52 కోట్ల 72 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పరంగా ఇప్పటి వరకు 40 శాతం రీకవరీ రేట్ ని సాధించింది.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల నుండి 24 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా,తమిళనాడు నుండి 9 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 3 కోట్ల 80 లక్షల రూపాయిలు, కేరళ నుండి 52 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 20 లక్షలు, ఓవర్సీస్ నుండి 14 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నేడు కూడా ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకుంటుంది. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 20 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్ కూడా అద్భుతంగా ఉండేలా ఉంది. రేపు ఒక్క రోజు స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవచ్చు.
Also Read: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!