Mahesh Babu Arjun Movie: సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మురారి(Murari), ఒక్కడు (Okkadu) సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్న ఆయన పోకిరి (Pokiri) సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సినిమాను చేస్తున్న ఆయన పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు హాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇచ్చే రేంజ్ కి వెళ్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక మహేష్ బాబు చేసిన ఒక సినిమాలో వాళ్ళ అక్క అయిన మంజుల నటించాల్సింది. కానీ చివరి నిమిషంలో తను ఆ పాత్ర నుంచి తప్పుకోవడంతో ఆ పాత్ర కోసం వేరొక నటిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆమెతో చేయించాలనుకున్న పాత్ర ఏంటి? ఆ సినిమా ఏంటి? ఆమె ఎందుకు ఆ క్యారెక్టర్ నుంచి తప్పుకుంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నప్ప స్టోరీ మొత్తం లీక్ చేసిన మోహన్ బాబు..వీడియో వైరల్!
మహేష్ బాబు – గుణశేఖర్ (Gunashekar) కాంబోలో వచ్చిన అర్జున్ (Arjun) సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో మహేష్ బాబు అక్కగా కీర్తి రెడ్డి చాలా మంచి పర్ఫామెన్స్ ను ఇచ్చి సినిమా సక్సెస్ ను సాధించడంలో తను కీలక పాత్ర వహించిందనే చెప్పాలి… అయితే ఈ పాత్ర కోసం మొదటి గుణశేఖర్ మహేష్ బాబు వాళ్ళ అక్క అయిన మంజుల గారిని తీసుకోవాలని అనుకున్నారట.
అంతకుముందే ఆమె షో (Show) అనే ఒక సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అర్జున్ సినిమాలో కూడా మహేష్ బాబు అక్కగా మంజుల నటిస్తే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారట. కానీ మంజుల ఎందుకో తను ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వననే ఉద్దేశ్యంతో ఆమె ఆ క్యారెక్టర్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలైతే వచ్చాయి.
మరి మొత్తానికైతే కీర్తి రెడ్డిని ఈ క్యారెక్టర్ లో తీసుకోవడంతో ఆమె మహేష్ బాబు అక్కగా సెటిల్ పెర్ఫామెన్స్ ని ఇచ్చి సినిమా సక్సెస్ లో మేజర్ పాత్రను పోషించింది. మొత్తానికైతే నిజ జీవితంలో అక్క తమ్ముళ్ళు అయిన మహేష్ బాబు మంజుల ను స్క్రీన్ మీద కూడా అక్క తమ్ముళ్లుగా చూద్దామనుకున్న ఘట్టమనేని అభిమానులకు నిరాశ మిగిలిందనే చెప్పాలి…