Sekhar Kammula Kubera Remuneration: శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘కుబేర'(Kuberaa Movie) నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంది. అసలే సినిమాలు లేక గత నెల రోజుల నుండి ఖాళీగా ఉన్న థియేటర్స్ కి ఈ చిత్రం సరికొత్త ఊపిరి పోసింది. జనాలు థియేటర్స్ కి రావడం మానేశారు అంటూ గోల చేస్తున్న నిర్మాతలకు ఈ సినిమా ఒక సరికొత్త సమాధానం చెప్పింది. మంచి సినిమా తీస్తే కుటుంబ సమేతంగా సినిమా థియేటర్స్ కి కదులుతామని జనాలు మరోసారి చెప్పకనే చెప్పారు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండిపోయాయి. ఇలాంటి క్రౌడ్ ని చూసి ఎన్ని రోజులైందో అంటూ ట్రేడ్ విశ్లేషకులు ఆనందం తో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇకపోతే ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ ఎంత భారీ గా తీశారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ క్యాస్టింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇంత స్టార్ క్యాస్టింగ్ కి ఎంత ఖర్చు అయ్యింది, నటీనటులు ఒక్కొక్కరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. ధనుష్(Dhanush) ఈ సినిమా కోసం దాదాపుగా పాతిక కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నాడట. ఇంతటి భారీ రెమ్యూనరేషన్ ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాకు కూడా తీసుకోలేదు. అదే విధంగా స్పెషల్ రోల్ చేసిన అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) 14 కోట్ల రూపాయిలు, హీరోయిన్ గా నటించిన రష్మిక(Rashmika Mandanna) 4 కోట్ల రూపాయిలు, సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల రెమ్యూనరేషన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.
‘ఫిదా’ సినిమా ముందు వరకు కూడా ఈయన తన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలను నిర్మించేవాడు. ‘ఫిదా’ నుండి ఇతర బ్యానర్స్ లో పనిచేయడం మొదలు పెట్టాడు. ఫిదా చిత్రానికి రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, కానీ ‘లవ్ స్టోరీ’ చిత్రానికి మాత్రం లాభాల్లో వాటాలు తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త. ‘లవ్ స్టోరీ’ ని నిర్మించిన సునీల్ నారంగ్ నే ‘కుబేర’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాకు కూడా ఆయన లాభాల్లో వాటాలు అడిగాడట. సినిమాకు ఫుల్ రన్ లో దాదాపుగా 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే ధనుష్, నాగార్జున కంటే శేఖర్ కమ్ముల నే ఈ చిత్రానికి ఎక్కువ రెమ్యూనరేషన్ ని తీసుకున్నవాడు అవుతాడు. కేవలం శేఖర్ కమ్ముల మాత్రమే కాదు, ఈమధ్య కాలం లో కొంతమంది హీరోలు,డైరెక్టర్లు ఎక్కువగా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు.