Seethamma Vakitlo Sirimalle Chettu: రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లో మొదటి నుండి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్(Dy CM Pawan Kalyan), మహేష్ బాబు(Superstar Mahesh Babu) వంటి స్టార్ హీరోల కారణంగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ తారాస్థాయికి చేరింది. ఈ ఇరువురి హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో ఈ ట్రెండ్ ని ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా అనుసరించారు. దీంతో ఈ ట్రెండ్ నేషనల్ లెవెల్ లో పాపులర్ అయ్యి, బాలీవుడ్ వరకు ఎగబాకింది. ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ తర్వాత, రీసెంట్ గా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ‘ఆరెంజ్’ చిత్రానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపుని కొనసాగిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(Seethamma Vakitlo Sirimalle Chettu) చిత్రాన్ని ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చేస్తున్నారు.
Also Read : ‘పుష్ప 2’ ని వెనక్కి నెట్టిన ‘లక్కీ భాస్కర్’..నెట్ ఫ్లిక్స్ లో పైచెయ్యి..ఇదేమి మాస్ రాంపేజ్ బాబోయ్!
ఈ సినిమాకి రీ రిలీజ్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. బుక్ మై షో యాప్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 60 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇది అభిమానులు ప్లాన్ చేసుకున్న సినిమా కాదు. నిర్మాత దిల్ రాజు థియేటర్స్ కి ఫీడింగ్ కోసం విడుదల చేసుకుంటున్న సినిమా. అలాంటి సినిమాకి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం అనేది అభిమానులు కూడా ఊహించలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఊపు చూస్తుంటే మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇప్పటికీ టీవీ టెలికాస్ట్ లో ఈ చిత్రానికి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి.
ఈ సినిమాని చూస్తున్నంతసేపు మన కుటుంబం లో జరిగే విశేషాలే గుర్తుకు వస్తుంటాయి. మహేష్ బాబు, వెంకటేష్(Victory Venkatesh) ఈ చిత్రంలో నటించినట్టు మనకి అనిపించదు. జీవించినట్టు అనిపిస్తుంది. నిజమైన అన్నదమ్ములు లాగా వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. అంతే కాదు టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేయడం అనేది, ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కాలం లో జరిగేది. చాలా కాలం గ్యాప్ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ద్వారా మరోసారి ఆ ఫీట్ రిపీట్ అయ్యింది. ఈ చిత్రం నుండే మన టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టార్ర్ర్ ట్రెండ్ ఊపు అందుకుంది. ఆరోజుల్లో 52 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డుని నెలకొల్పబోతుంది అనేది చూడాలి.
Also Read : నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ఆ హాలీవుడ్ చిత్రానికి రీమేకా? అడ్డంగా దొరికిపోయారుగా..స్టోరీ ఏమిటంటే!