Chhaava Collection: బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రభంజనం సృష్టించి, ఇప్పటికీ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ‘చావా'(Chhaava Movie) చిత్రం, రీసెంట్ గానే తెలుగు లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ సంస్థ తరుపున అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు(Bunny Vasu) కొనుగోలు చేసి గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసారు. హిందీ లో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగు లో విడుదల అవుతుంది, రెస్పాన్స్ ఏముంటుందిలే అని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. మూడు రోజులకు కలిపి బుక్ మై షో యాప్ లో 1,80,000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా డిస్ట్రిక్ట్ యాప్ లో కూడా ఈ సినిమాకి లక్షకు పైగా టిక్కెట్లు సేల్ అయ్యినట్టు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ మూడు రోజులకు గాను ఈ సినిమాకి దాదాపుగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఆలస్యంగా రిలీజ్ అయ్యినప్పటికీ ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. నేడు కూడా ఈ చిత్రానికి గంటకు వెయ్యి పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే లాంగ్ రన్ ఈ చిత్రానికి కచ్చితంగా ఉండేలా అనిపిస్తుంది. అదే కనుక జరిగితే ఈ సినిమాకి లాంగ్ రన్ లో మరో 30 కోట్ల రూపాయిల గ్రాస్ అదనంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మార్చి నెలాఖరు వరకు ప్రేక్షకులు థియేటర్స్ కి కచ్చితంగా వెళ్లి చూడాలి అని అనిపించేంత సినిమాలు విడుదల కావడం లేదు. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మరో పక్క హిందీ లో ఈ చిత్రం రీసెంట్ గానే 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలోకి చేరింది.
శనివారం రోజున ఈ సినిమాకి 13 కోట్ల 70 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, ఆదివారం రోజున కేవలం 8 కోట్ల 43 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. కారణం నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగడం వల్లే. అత్యధిక శాతం మంది క్రికెట్ చూడడం కోసం టీవీ లేక్ అత్తుకుపోవడం తో, చావా కలెక్షన్స్ పై చాలా గట్టి ప్రభావం పడింది. నిన్న కేవలం డిస్నీ + హాట్ స్టార్ యాప్ లో ఈ మ్యాచ్ ని 85 కోట్ల మంది జనాలు వీక్షించారు. ఆ ప్రభావం వల్ల చావా ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ దారుణంగా పడిపోయాయి. లేకుంటే కచ్చితంగా ఈ చిత్రం నిన్న 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. నాల్గవ వీకెండ్ మొత్తం కలిపి ఈ సినిమాకు 28 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి.