Naresh: ‘అశోక్ గల్లా’ హీరోగా ఈ సంక్రాంతికి లాంచ్ అయ్యాడు. పెద్ద ఫ్యామిలీకి చెందిన వారసుడు కాబట్టి.. ‘అశోక్ గల్లా’ సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. అయితే, సీనియర్ నటుడు నరేష్ సినిమా రిలీజ్ తర్వాత కూడా.. సినిమాని దారుణంగా ప్రమోట్ చేస్తున్నాడు. అంతకు మించిన దారుణంగా హీరోగా ‘అశోక్ గల్లా’ను ఇంకా గొప్పగా ప్రమోట్ చేస్తున్నాడు. అసలు అశోక్ గల్లాను నరేష్ పెద్దవాళ్ళతో ఎలా పోలుస్తూ చెబుతున్నాడో ఆయనకే తెలియడం లేదు.

ఇంతకీ నరేష్ ఏం చెప్పాడో తెలుసా ? కామెడీ టైమింగ్ ఉన్న ఏ హీరో అయినా బాగా సక్సెస్ అవుతాడని, అలాంటి టైమింగ్ అమితాబ్‌లో చూశాను, ఇప్పుడు మళ్ళీ గల్లా అశోక్‌లో చూశానని నటుడు నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇవి మామూలు కామెంట్స్ కాదు. ఏమిటి ? గొప్ప టైమింగ్ ను అమితాబ్ లో చూసిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ గల్లా అశోక్ లోనే చూశాడట. అదేంటి ? నరేష్ కి ఏమైనా కంటి సమస్యలు ఉన్నాయా ? అంటూ నెటిజన్లు ట్రోలింగ్ కి దిగారు.
Also Read: నీ పెంపకం మీద అనుమానం వస్తుంది – అనసూయ

తప్పు లేదు లేండి. లేకపోతే.. ఏమిటి ఇది ? గల్లా అశోక్ ను అమితాబ్ తో పోల్చడం ఏమిటి ?. నరేష్ కి గల్లా అశోక్ ఎంత చుట్టం అయితే మాత్రం.. మరి ఈ రేంజ్ కామెంట్స్ చేయాలా ? ఏమిటో నరేష్. ఏది చేసినా ఇలాగే ఉంటుంది. ఇక గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా వచ్చిన ఈ ‘హీరో’ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే, గల్లా అశోక్ హీరోగా మాత్రం జనంలోకి వెళ్ళాడు.
ఎంతైనా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు జయదేవ్ గల్లా కుమారుడిగా అలాగే, హీరో మహేష్ బాబు మేనల్లుడిగా అశోక్ గల్లా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘హీరో’ అనే పేరుతో అశోక్ గల్లా హీరోగా రూపొందిన ఈ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందింది.
Also Read: ‘జై భీమ్’ ఖాతాలో మరో అరుదైన ఘనత !
[…] Also Read: ప్చ్.. అమితాబ్ లో తర్వాత మళ్ళీ గల్లా… […]