Chhaava
Chhaava : ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలకు మంచి గుర్తింపైతే ఉంటుంది…అలాంటి సినిమాలను చూసినప్పుడు మనసుకు తృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వచ్చిన ఛావా సినిమా కూడా ప్రేక్షకులందరిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది…గొప్ప వాళ్ల చరిత్ర తెలుసుకున్న ప్రతి సారి ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అవితూనే ఉంటారు…
బాలీవుడ్ ఇండస్ట్రీ లో గత కొద్ది రోజుల నుంచి సరైన సక్సెస్ ఫుల్ సినిమాలైతే రావడం లేదు. ఇక రీసెంట్ గా రిలీజైన ‘ఛావా’ (Chavaa) సినిమా మాత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది. ఛత్రపతి శివాజీ (Shivaji) కొడుకు అయిన శంబాజీ (Shambaji) మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ సినిమాలో ‘శంబాజీ మహరాజ్’ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు. మరాఠా ప్రజలను ఎలా కాపాడుకున్నాడు అనేది కూడా చాలా స్పష్టం గా చూపించారు…ఇక ‘విక్కి కౌశల్’ (Vicky Koushal) పోషించిన ఈ పాత్ర సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడిని కదిలిస్తుంది…ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇటువంటి సినిమాను ఎప్పుడు చూడలేదని అక్కడి ప్రేక్షకులు కూడా తెలియజేస్తున్నారు. నిజంగా బాలీవుడ్ ప్రేక్షకులను బాగా కదిలించిన ఈ సినిమాను ఒకటికి రెండు సార్లు చూడటానికి ఇష్టపడుతున్నారు అంటే అక్కడి ప్రజలు శివాజీ మీద అతని కొడుకు మీద ఎంతటి ప్రేమను కలిగి ఉన్నారో చెప్పవచ్చు…మొత్తానికైతే చరిత్ర పుటల్లో దాగివున్న నిజాలను బయటికి చెప్పడం అనేది నిజం గా చాలా గ్రేట్ అనే చెప్పాలి…
ఈ సినిమా ఇచ్చిన బుస్టాప్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి పూనుకొని మంచి సినిమాలు తీస్తుందని అక్కడి సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండటం విశేషం…ఇక ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న డామినేషన్ ను తట్టుకొని నిలబడాలంటే ఇలాంటి సినిమాలు మరికొన్ని రావాల్సిందే అని అక్కడి విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…
అయితే ఈ సినిమాలో సీన్స్ చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందువల్లే వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ సినిమాను చూస్తూ భారీ కలెక్షన్స్ ను సాధిస్తూ ముందుకు తీసుకెళుతున్నారు… ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ ఎక్కువగా వస్తుంది. తద్వారా సినిమా ప్రేక్షకులందరు ఈ సినిమాను చూడటానికి అసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ సినిమాకి చాలా బజ్ ఉంది.
ఇక ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం ఉన్నవాళ్లు కూడా ఈ సినిమాని ఎక్కువగా చూస్తూ ముందుకు సాగుతూ తీసుకెళ్తుండటం విశేషం… ముఖ్యంగా ఛత్రపతి శివాజీ కి చాలామంది అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఈ సినిమాని చూసి శంభాజీ యొక్క క్యారెక్టర్ ని ఎంజాయ్ చేయడమే కాకుండా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారనే చెప్పాలి…
హిందీ సినిమా “చావా” చూసిన ప్రేక్షకులు ఎలా చలించిపోయారో చూడండి.మరాఠా సమాఖ్య పాలకుడు సంభాజీ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చారిత్రాత్మక చిత్రంలో నటుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించారు.ప్రస్తుతం
“చావా” చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ప్రేక్షకుల,విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. pic.twitter.com/kq4pvmKEnj— Dr. K. Srinivasa Varma (@DrKSVarma) February 17, 2025