Radhe Shyam: రాధే శ్యామ్ సినిమా నుంచి రెండో పాట ప్రోమో విడుదల… తెలుగు ఆడియన్స్ కు నిరాశే

Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల […]

Written By: Raghava Rao Gara, Updated On : November 30, 2021 4:35 pm
Follow us on

Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ పతాకం పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ఓ డార్లింగ్ అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చింది చిత్ర బృందం.

Radhe Shyam

ఇటీవల ఈ మూవీలోని తొలి పాట ‘ఈ రాతలే’ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈరోజు మూవీలోని రెండో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మధ్యాహ్నం హిందీ వెర్షన్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం… భాషల్లో సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం అనేది ఇదే తొలిసారి. ఈ ప్రోమో లో విజువల్స్, హీరోహీరోయిన్ల లుక్స్ అదిరిపోయాయ్ అని చెప్పాలి.

Also Read: ‘అయ్యయ్యో.. భీమ్లా నాయకా ఎంత పని జరిగి పోయినాది ?

ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ డార్లింగ్‌ ప్రభాస్ ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశారు. ఈ సినిమాకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. హిందీ వర్షన్ ప్రోమోలో లిరిక్స్ ఉండగా… తెలుగులో లిరిక్స్ ఏం లేకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సరిపెట్టారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న కారణంగా తెలుగు ను వదిలేసి హింది పై మూవీ మేకర్స్ ఎక్కువ ఇంటరెస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ నుంచి విడుదలైన జనని పాటను మొదను తెలుగు మీడియా కె చూపించారు జక్కన్న. కానీ ప్రభాస్ మూవీ నిర్మాతలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు చేదు అనుభవాన్నే మిగిల్చారు. హిందీ లో మొదటగా పాటను రిలీజ్ చేయడమే కాకుండా… ఇప్పుడు తెలుగులో లిరిక్స్ ఏం లేకుండా రిలీజ్ చేయడం పట్ల ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.  తెలుగు పూర్తి పాట డిసెంబర్ 1వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: ‘పూజా హెగ్డే’ బికినీనే నమ్ముకుంటున్న త్రివిక్రమ్ !