https://oktelugu.com/

Bollywood: బాలీవుడ్ ప్రేమ జంట పెళ్లి… మళ్ళీ వాయిదా ?

Bollywood: బాలీవుడ్‌ ప్రేమ జంటలో ఒకరు రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌. వీరి వివాహం కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి అంతకు అంత వెనక్కి వెళ్తూనే ఉంది అన్ని సవ్యంగా ఉంటే ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి వధువులు గా ఈ జంట ఒకటి కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే నెలలో వీరు పెళ్లి జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 29, 2021 / 07:52 PM IST
    Follow us on

    Bollywood: బాలీవుడ్‌ ప్రేమ జంటలో ఒకరు రణబీర్‌ కపూర్‌, ఆలియాభట్‌. వీరి వివాహం కోసం అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వీరి పెళ్లి అంతకు అంత వెనక్కి వెళ్తూనే ఉంది అన్ని సవ్యంగా ఉంటే ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి వధువులు గా ఈ జంట ఒకటి కావల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది ఏప్రిల్‌–మే నెలలో వీరు పెళ్లి జరగనుందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

    Bollywood

    Also Read: ఆ విషయంలో మీడియాకి సారీ చెప్పిన బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌…

    కరోనా కారణంగా గత కొన్నాళ్లుగా సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దర్శకులు నిర్మాతలు ఒకరి తర్వాత ఒకరు తమ సినిమాలను త్వరగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయాలని ఆలోచన ఉన్నారు అయితే ఈ కారణంగా రణబీర్, ఆలియా కాస్త సినిమా షెడ్యూల్స్‌, బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నారట. విదేశాల్లో పెళ్లి అంటే కాస్త ముందు నుంచే ప్రణాళికలు ఉండాలి కాబట్టి.. అన్ని పనులు పూర్తి చేసి కొంత వెకేషన్‌ తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకోనున్నారట. అయితే పెళ్లి వాయిదాకు మరో కారణం కూడా వినిపిస్తుంది. రణ్‌బీర్‌, ఆలియా  డ్రీమ్ హౌస్ వచ్చే ఏడాదికి పూర్తి కానుందట. అది పూర్తయ్యాక వివాహ బంధంతో వీరు ఒకటవ్వాలని వచ్చే ఏడాదికి పెళ్లిని వాయిదా వేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: మంచి అబ్బాయి కోసం వెయిటింగ్ అంటున్న అందాల భామ… నిధి అగర్వాల్