Parliament winter session 2021:తగ్గేదేలే అన్నట్టుగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో రెచ్చిపోయారు. మోడీకి, బీజేపీకి ఇక భయపడేది లేదన్నట్టుగా ఆందోళన బాట పట్టారు. తెలంగాణ వరిధాన్యాన్ని కేంద్రమే కొనాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేశారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
తెలంగాణకు నిధులు, ఇతర అవసరాల కోసం ఇన్నాళ్లు కేసీఆర్ కాస్త తగ్గి వ్యవహరించాడు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంతో ఫైట్ కు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి ధర్నా చేశారు. ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా బీజేపీని కార్నర్ చేసేలా కొత్త విధానాన్ని టీఆర్ఎస్ ఎంచుకుంది. ‘జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని’ టీఆర్ఎస్ ఎత్తుకుంది. వెంటనే దీన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ లో ప్లకార్డులు పట్టుకొని మరీ నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ వచ్చాక కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో ప్రాజెక్టుల్లోకి ఫుల్లుగా నీళ్లు వచ్చి సాగు సామర్థ్యం తెలంగానలో విపరీతంగా పెరిగింది. ప్రభుత్వ పథకాలు, రైతుబంధుతో రైతులు పంటలు పండించడం పెంచారు. 24 గంటల ఉచిత విద్యుత్ కూడా దిగుబడులు పెరగడానికి కారణమైంది.
Also Read: కిషన్‌రెడ్డి మొగోనివైతే ధాన్యం ఎంతకొంటారో చెప్పాలి! తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్
అయితే కేంద్రం ఎఫ్.సీఐ ఇతర సంస్థల ద్వారా కొనుగోళ్లు జరపడం లేదు. పంజాబ్ వంటి రాష్ట్రంలో మొత్తం సేకరిస్తున్న కేంద్రం తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరిధాన్యాన్ని పూర్తిగా సేకరించాలని పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. స్పీకర్ తిరస్కరించినా తగ్గేది లేదంటూ ప్లకార్డులతో పోరాటం చేశారు.
ఇప్పటికై రైతు సమస్యలు, సాగుచట్టాలతో తలబొప్పి కట్టిన కేంద్రానికి తాజాగా టీఆర్ఎస్ ఆందోళనతో మరోసారి రైతుల విషయంలో బీజేపీ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత కవర్ చేద్దామన్నా సమస్య పరిష్కారం అయ్యే సూచనలు లేకపోవడం.. బీజేపీ మాటలను టీఆర్ఎస్ వినే పరిస్థితి లేకపోవడంతో దీనిపై ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.
Also Read: కేసీఆర్ లో భయం.. కరీంనగర్ ఎమ్మెల్సీ సీటు కోల్పోనుందా?