Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి అదిరిపోయే అప్డేట్ … “లాలా భీమ్లా” రిలీజ్ అప్పుడే

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె  చంద్ర దర్శకత్వం వహిస్తుండగా…  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ను మూవీ టీమ్ ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి దీపావళి కానుకగా  రెండో సాంగ్ ” […]

Written By: Raghava Rao Gara, Updated On : November 3, 2021 11:39 am
Follow us on

Bheemla Nayak: పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె  చంద్ర దర్శకత్వం వహిస్తుండగా…  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ను మూవీ టీమ్ ప్రకటించింది.

ఈ సినిమాకు సంబంధించి దీపావళి కానుకగా  రెండో సాంగ్ ” లాలా భీమ్లా ” అనే లిరికల్ సాంగ్ ను ఇవాళ సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోస్టర్ ను కూడా మూవీ టీమ్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారనే  చెప్పాలి. అలాగే ఓ మందు బాటిల్ ను ముందు పెట్టుకుని…. లుంగీ గెటప్ లో పవన్ కళ్యాన్ అంతకు ముందు ఎన్నడూ చూడని గెటప్ లో అదరగొడుతున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

https://twitter.com/SitharaEnts/status/1455769231509766145?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1455769231509766145%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Fbheemlanayak-new-update.html

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త మీనన్ చేస్తుంది. అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తునడడం విశేషం అని చెప్పాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది.