Allu Arjun: ‘అల్లు అర్జున్ ఏమిట్రా రెండ్రోజులకు ఒకసారి ఒక ఈవెంట్ అంటున్నాడు’ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది. బన్నీలా మరో ఏ స్టార్ హీరో ఇలా రెగ్యులర్ గా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఒక్క బన్నీ మాత్రమే ప్రజెంట్ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిపిస్తున్నాడు, లాంగ్ స్పీచ్ లు ఇస్తున్నాడు. స్టార్ హీరోలు రేర్ గా కనిపిస్తేనే.. కనిపించినప్పుడు ఫ్యాన్స్ కూడా ఫుల్ గా జోష్ చూపిస్తారు.
![]()
కానీ, రెండ్రోజులకు ఇలా ఒకసారి ఒక ఈవెంట్ కి వస్తే.. క్రేజ్ ఏముంటుంది ? బన్నీ గెస్ట్ గా వారానికో ఈవెంట్ జరుగుతుంది. ఈ మధ్య ఇప్పటికే ‘వరుడు కావలెను’ , ‘పుష్పక విమానం’ ఈవెంట్స్ లో గెస్ట్ గా వచ్చాడు. మొదటి ఈవెంట్ లో ఫ్యాన్స్ ఉత్సాహానికి, రెండో ఈవెంట్ లో ఫ్యాన్స్ ఉత్సాహానికి చాలా వ్యత్యాసం కనిపించింది.
ఇక ఆహా ఆప్ గ్రాండ్ గా ‘ఆహా 2.O’ అనే ఈవెంట్ ను నిన్న చేశారు. ఈ ఈవెంట్ కి కూడా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. గ్రాండ్ ఈవెంట్ అంటూ బాగా హడావిడి చేయడంతో ఫ్యాన్స్ కూడా బాగానే హాజరయ్యారు. బన్నీ కూడా ఇది ఆహా కి సంబంధించి ఒక బిగ్ ఈవెంట్ అంటూ గెస్ట్ గా తన స్టైల్ లో బాగానే మాట్లాడుతూ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించాడు.
కానీ విచిత్రంగా బన్నీలోని ఉత్సాహం, ఆయన ఫ్యాన్స్ లో కనిపించలేదు. అయినా ఇలా రెండ్రోజుల కో ఈవెంట్ లో బన్నీ కనిపిస్తూ చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్తూ ఉంటే ఫ్యాన్స్ కు నీరసమే వస్తోంది. ఇప్పటికే బన్నీ పై ఎప్పటినుంచో ఒక రూమర్ ఉంది. బన్నీ ఎప్పుడూ ఒకే రకం స్పీచ్ ఇస్తుంటాడు అని ఒక నెగిటివ్ ప్రచారం ఉంది.
ఇప్పుడు వరుస ఈవెంట్స్ లో బన్నీ స్పీచ్ లు వింటే.. అది నిజమే అనిపిస్తుంది. బన్నీ తన క్రేజ్ ను మళ్లీ మళ్లీ చూపించుకునే ప్రయత్నమే ఇది అని అర్ధం అవుతున్నా… బన్నీ అర్ధం చేసుకోవాల్సింది ఏమిటంటే.. స్టార్ రెగ్యులర్ గా కనిపిస్తే అసలుకే మోసం వస్తోందని. అతి ఎప్పటికైనా నష్టమే. స్టార్ హీరోలు అప్పుడప్పుడు కనిపిస్తూ.. చాలా తక్కువ సేపు మాట్లాడితేనే వారికి క్రేజ్ ఉంటుంది. లేదంటే క్రేజే లూజ్ అవుతుంది.