Bigg Boss 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ మొత్తం ట్విస్టులు, టర్నులు అన్ లిమిటెడ్ గా ఉంటాయని సీజన్ ప్రారంభం నుండి ఊదరగొట్టేసిన సంగతి మన అందరికి తెలిసిందే. ఆడియన్స్ కి , లోపల ఉన్న కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరే రేంజ్ ట్విస్టులు ఇప్పటి వరకు ఏవైనా ఉన్నాయా అంటే, అది మణికంఠ ఎలిమినేషన్, ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ గా పాత సీజన్ కి సంబంధించిన వాళ్ళు హౌస్ లోకి అడుగుపెట్టడం, అదే విధంగా గత వారం ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి నామినేషన్ చేసి వెళ్లడం వంటివి ఆడియన్స్ సూపర్ ట్విస్టులుగా అనిపించాయి. ఈ వారం కూడా అలాంటి ట్విస్టులు బోలెడన్ని ఉన్నాయట. ఈ వారం మొత్తం ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు నిర్వహించబోతున్నారు. ఈ టాస్కులు చాలా ఫైర్ మీద జరగబోతున్నాయి. అయితే ఎప్పటి లాగా రొటీన్ గా కాకుండా, కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం.
ప్రతీ టాస్కులోను సంచాలక్స్ గా హౌస్ లో ఉన్నవాళ్లే వ్యవహరించే వాళ్ళు. కానీ ఈసారి మాత్రం పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ లోపలకు వచ్చి ఈ ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులను నిర్వహించబోతున్నారు. సీజన్ 4 మరియు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ లలో రన్నర్ గా నిల్చిన అఖిల్ సార్థక్, అలాగే సీజన్ 4 టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిన అలేఖ్య హారిక ఈ రేపు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీళ్ళ సమక్ష్యం లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు జరగనున్నాయి. అయితే వీళ్ళు కేవలం రెండు లెవెల్స్ ని మాత్రమే నిర్వహిస్తారు. మిగిలిన లెవెల్స్ కి ఇంకా పాత కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు. సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్నీ, సీజన్ 4 లో టాప్ 3 వరకు వచ్చిన సోహైల్ కూడా హౌస్ లోకి రాబోతున్నారు.
అదే విధంగా సీజన్ 7 లో టాప్ 3 గా నిల్చిన శివాజీ, విన్నర్ గా నిల్చిన పల్లవి ప్రశాంత్, రన్నర్ గా నిల్చిన అమర్ దీప్, అదే విధంగా టాప్ 5 గా నిల్చిన ప్రియాంక జైన్ వంటి వారిలో ఇద్దరు హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ టికెట్ టు ఫినాలే రేస్ కేవలం ఈ ఒక్క వారం మాత్రమే ఉంటుందా?, లేదా వచ్చే వారం కూడా కొనసాగబోతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం హాట్ స్టార్ లో నామినేషన్స్ లైవ్ లో జరుగుతున్నాయి. అందరూ ఊహించినట్టే స్నేహితులను పక్కన పెట్టి, మొదటి నుండి శత్రుత్వం మైంటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే నామినేషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రోహిణి, నబీల్ తప్ప హౌస్ లో ఉన్నవాళ్ళంతా నామినేషన్స్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.