https://oktelugu.com/

Lucky Bhaskar : కొత్త సినిమాలను సైతం డామినేట్ చేసిన ‘లక్కీ భాస్కర్’..25 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూస్తే ఆశ్చర్యపోతారు!

ఈ దీపావళి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎన్నో వెలుగులు పంచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పండుగ రోజున విడుదలైన లక్కీ భాస్కర్, అమరన్, క వంటి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.

Written By:
  • Vicky
  • , Updated On : November 25, 2024 / 04:33 PM IST

    'Lucky Bhaskar', which has dominated new movies as well.

    Follow us on

    Lucky Bhaskar : ఈ దీపావళి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎన్నో వెలుగులు పంచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పండుగ రోజున విడుదలైన లక్కీ భాస్కర్, అమరన్, క వంటి చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. వీటిల్లో లక్కీ భాస్కర్ చిత్రానికి ఇప్పటికీ డీసెంట్ స్థాయిలో షేర్ వసూళ్లు వస్తుండడం గమనార్హం. విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలను కూడా డామినేట్ చేసింది. సూర్య కంగువ చిత్రానికి 11వ రోజు 17 వేల టికెట్స్ బుక్ మై షో లో అమ్ముడుపోయాయి. అదే విధంగా విశ్వక్ సేన్ ‘మెకానిక్ రౌడీ’ చిత్రానికి మూడవ రోజు 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, సత్యదేవ్ ‘జీబ్రా’ చిత్రానికి 26 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. కానీ ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి మాత్రం 24 గంటల్లో 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

    ఓటీటీ కాలం లో ఒక సినిమాకి ఈ స్థాయి థియేట్రికల్ రన్, అది కూడా ఒక మలయాళం హీరోకి రావడం గమనార్హం. ఈ నెల 30వ తారీఖు నుండి ఈ చిత్రం అన్ని ప్రాంతీయ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది అనే వార్త వచ్చినప్పటికీ కూడా నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. ఓవరాల్ గా 25 రోజులకు గానూ ప్రాంతాలవారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం. తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల రూపాయలకు జరగగా, 25 రోజులకు గానూ 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే బయ్యర్స్ కి 6 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట.

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కేరళలో 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటకలో 6 కోట్ల 60 లక్షలు, తమిళనాడులో 15 కోట్ల 55 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2 కోట్ల 10 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 27 కోట్ల 20 లక్షల రూపాయిల వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 25 రోజులకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, అన్ని భాషలకు కలిపి ఈ సినిమాకి 110 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 53 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే నెంబర్ 1 బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. భవిష్యత్తులో ఈ చిత్రానికి మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 థియేటర్స్ లోకి వచ్చే వరకు ఈ సినిమాకి మంచి థియేట్రికల్ రన్ ఉంటుందని ఆశిస్తున్నారు మేకర్స్.