Scene Movie: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ ఏడాది వరుసగా రెండు భారీ హిట్స్ తో మంచి ఒప్పు మీదున్న సూర్య, సీన్ తో హ్యాట్రిక్ ని అందుకున్నాడు. 6 రోజుల్లో అన్ని ప్రాంతాలకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల నుండి 22 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టగా ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ ని రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి క్లోజింగ్ లో 300 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందట.
ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు నుండి 65 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కర్ణాటక నుండి 13 కోట్ల రూపాయిలు, కేరళ నుండి 22 కోట్ల 40 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 45 లక్షలు , ఓవర్సీస్ నుండి 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా , 6 రోజుల్లో 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ రేంజ్ కి చేరుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఓవరాల్ వరల్డ్ వైడ్ గా అయితే ee చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంది.