Jailer 2 Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఈ సినిమా తమిళ ప్రేక్షకుల చిరకాల కోరికని నెరవేర్చడం లో విఫలం అయ్యింది. అన్ని ఇండస్ట్రీస్ లోని వెయ్యి కోట్ల మార్కు ని దాటినా సినిమాలు ఉన్నాయి. ‘జైలర్ 2’ తో తమిళ ఇండస్ట్రీ కి కూడా వెయ్యి కోట్ల సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఈ చిత్రం కలెక్టన్స్ 831 కోట్ల రూపాయిల వద్ద క్లోజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుండి దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతకు దాదాపుగా 100 కోట్ల లాభాలు వచ్చాయి. ఓవరాల్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినప్పటికీ , వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకోలేకపోయినందుకు తమిళ ప్రేక్షకుల్లో చిన్న నిరాశని మిగిలించింది ఈ చిత్రం.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు ప్రాంతం నుండి 218 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , కర్ణాటక నుండి 95 కోట్ల 55 లక్షలు , కేరళ నుండి 79 కోట్ల 60 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 61 కోట్ల 40 లక్షలు , ఓవర్సీస్ నుండి 277 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఓవరాల్ గా 832 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 400 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు అన్ని భాషలకు కలిపి 300 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. బయ్యర్స్ కి ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. దీన్ని బట్టీ ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.