https://oktelugu.com/

‘తిమ్మరుసు’ ట్రైలర్ వస్తోంది!

సరికొత్త కథలతో టాలీవుడ్ లో గుర్తింపు పొందిన హీరో ‘సత్యదేవ్’. ఈ కుర్ర హీరో సినిమా తీస్తున్నాడంటే అందులో ఏదో విషయం ఉన్నట్టే లెక్క. ఈ క్రమంలోనే తాజాగా డిఫెరెంట్ హెడ్ లైన్స్ తో ‘తిమ్మరుసు’ చిత్రాన్ని తీస్తున్నాడు. తిమ్మరసు చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ప్రోమో చాలా ఆసక్తి రేపింది. స్కైలాబ్ సమయంలో ప్రజలు ఒక బావిలో దాక్కున్న ప్రోమో చిత్రంపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా ‘తిమ్మరసు’ చిత్రం ట్రైలర్ లాంచ్ కు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2021 / 05:54 PM IST
    Follow us on

    సరికొత్త కథలతో టాలీవుడ్ లో గుర్తింపు పొందిన హీరో ‘సత్యదేవ్’. ఈ కుర్ర హీరో సినిమా తీస్తున్నాడంటే అందులో ఏదో విషయం ఉన్నట్టే లెక్క. ఈ క్రమంలోనే తాజాగా డిఫెరెంట్ హెడ్ లైన్స్ తో ‘తిమ్మరుసు’ చిత్రాన్ని తీస్తున్నాడు.

    తిమ్మరసు చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన ప్రోమో చాలా ఆసక్తి రేపింది. స్కైలాబ్ సమయంలో ప్రజలు ఒక బావిలో దాక్కున్న ప్రోమో చిత్రంపై అంచనాలు పెంచేసింది.

    ఈ క్రమంలోనే తాజాగా ‘తిమ్మరసు’ చిత్రం ట్రైలర్ లాంచ్ కు చేరువైంది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేపు సాయంత్రం 26వ తేదీన ఈ ట్రైలర్ ను ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. ఇంతకుముందే ప్రకటించినట్టుగా జూలై 30న తెరపైకి రానుంది. సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా టాలీవుడ్ లో ఈ టైంలో డైరెక్టుగా విడుదలయ్యే సినిమాగా ఉంది. దీన్ని థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

    తిమ్మరసు చిత్రంలో సత్యదేవ్ లాయర్ గా నటిస్తున్నాడు. ఒక కొత్త కాన్సెప్ట్ తో దీన్ని తీసినట్టు తెలుస్తోంది.‘స్కైలాబ్’ నాటి ఇతివృత్తాన్ని తీసుకున్నట్టు గా సమాచారం.