https://oktelugu.com/

విలక్షణ నటుడు నుండి మళ్లీ ‘బ్లఫ్ మాస్టర్’ ?

సత్యదేవ్, షార్ట్ ఫిల్మ్‌ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, మిస్టర్ పర్ఫెక్ట్‌లో ప్రభాస్ ఫ్రెండ్ గా చిన్న క్యారెక్టర్ రోల్‌లో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ పాత్రలను పోషించటానికి ఇష్టపడే సత్యదేవ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మిలో ప్రధాన పాత్రను పోషించడం ద్వారా అతనికి పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా, గణేష్ పట్టాబి దర్శకత్వం వహించి, రమేష్ పిళ్ళై నిర్మించిన ‘బ్లఫ్ మాస్టర్’ ‌మూవీ తో […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 07:29 PM IST
    Follow us on


    సత్యదేవ్, షార్ట్ ఫిల్మ్‌ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, మిస్టర్ పర్ఫెక్ట్‌లో ప్రభాస్ ఫ్రెండ్ గా చిన్న క్యారెక్టర్ రోల్‌లో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ పాత్రలను పోషించటానికి ఇష్టపడే సత్యదేవ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మిలో ప్రధాన పాత్రను పోషించడం ద్వారా అతనికి పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా, గణేష్ పట్టాబి దర్శకత్వం వహించి, రమేష్ పిళ్ళై నిర్మించిన ‘బ్లఫ్ మాస్టర్’ ‌మూవీ తో మరోసారి తన నటనా విశ్వరూపం చూపించాడు. ఈ మూవీ తమిళ యాక్షన్-డ్రామా చిత్రం ‘సతురంగ వెట్టైకి’ రీమేక్. తెలుగులో ఈ మూవీ ఫర్వాలేదనిపించింది.

    Also Read: నిహారిక పెళ్ళికి వాళ్ళను వద్దంది నాగబాబా ? పవనా?

    ఆ తర్వాత బ్రోచెవారేవరురా, జార్జ్ రెడ్డి, రాగాల 24 గంటల్లో లాంటి మూవీస్ లో తన బహుముఖ పాత్రలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన సత్యదేవ్ ‘ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో ఉమా మహేశ్వర రావు పాత్రలో సత్యదేవ్‌ తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు.ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో గురించి ఒక వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ‘బ్లఫ్ మాస్టర్’ దర్శకుడు గణేష్ పట్టాబి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కొత్త మూవీ రాబోతున్నట్లుగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించాడు. అయితే ఈ మూవీ బ్లఫ్ మాస్టర్ మూవీకి సీక్వెల్ అయి ఉంటుందని గట్టిగా టాక్ వినిపిస్తుంది, ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ మూవీకి మాతృక అయిన’సతురంగ వెట్టై’ మూవీకి సీక్వెల్ వచ్చేసింది. కాబట్టి ఈ కాంబోలో వచ్చే మూవీ అదే అయి ఉంటుందని టాక్. కానీ నిర్మాత సి. కళ్యాణ్ మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

    Also Read: బొమ్మ ఆడించుకున్నారు… డబ్బులు అడిగితే చుక్కలు చూపిస్తున్నారు!

    ప్రస్తుతానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ కొత్త మూవీ ‘తిమ్మరుసు’ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష లాంటి నటీనటులు నటిస్తున్న ఈ సినిమాని జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ఫస్ట్ లుక్ టీజర్ ని డిసెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్