https://oktelugu.com/

మహేష్ ‘సర్కారు వారి..’ కథ అదే !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు గానీ, ఈ సినిమా క‌థేమిట‌న్న‌ది చూచాయిగా అర్థ‌మైపోయింది అంద‌రికీ. బ్యాంకుల ద‌గ్గ‌ర నుంచి వంద‌ల కోట్లు అప్పు చేసి, విదేశాల‌కు చెక్కేసిన విజ‌య్ మాల్యా లాంటి వాళ్ల మెడ‌లు వంచిన ఓ హీరో క‌థ అట ఇది. అంటే భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా మొత్తం కేంద్రీకృతమైందని.. మహేష్ […]

Written By:
  • admin
  • , Updated On : December 8, 2020 / 07:20 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు గానీ, ఈ సినిమా క‌థేమిట‌న్న‌ది చూచాయిగా అర్థ‌మైపోయింది అంద‌రికీ. బ్యాంకుల ద‌గ్గ‌ర నుంచి వంద‌ల కోట్లు అప్పు చేసి, విదేశాల‌కు చెక్కేసిన విజ‌య్ మాల్యా లాంటి వాళ్ల మెడ‌లు వంచిన ఓ హీరో క‌థ అట ఇది. అంటే భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా మొత్తం కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: నిహారిక పెళ్ళికి వాళ్ళను వద్దంది నాగబాబా ? పవనా?

    మరి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే కోణంలో ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగుతుందని..అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథ మరియు మహేష్ పాత్రకు సంబంధించిన అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి.

    Also Read: బొమ్మ ఆడించుకున్నారు… డబ్బులు అడిగితే చుక్కలు చూపిస్తున్నారు!

    వాటిల్లో పై రూమర్ బాగా నమ్మే విధంగా ఉండటంతో అందరూ ఇదే ఈ సినిమా కథ అని నమ్ముతున్నారు. అందుకే ఈ పాయింట్ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ ను బట్టి రాజకీయ అంశాల పై ప్రధానంగా ఈ సినిమా సాగుతుందేమో అనే పుకార్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా కథ దేని పై ఉండనుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్