
1970వ దశకంలో అంతరిక్షంలో స్కైల్యాబ్ సంబంధాలు తెగిపోయి భూమి వైపుకు దూసుకొచ్చింది. ఆ సమయంలో భూమి అంతం అవుతుందని చాలా మంది భూములు, ఆస్తులు అమ్ముకొని కోళ్లు, గొర్రెలు కోసుకొని తృప్తి తిన్నారు. ఇక భూమిపై మనుషులంతా చనిపోతారని తెగ ఎంజాయ్ చేశారు.
కానీ స్కైల్యాబ్ సముద్రంలో పడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. భూమ్మీద మనుషులకు ముప్పు తప్పింది. ఆ సమయంలో పుట్టిన వారికి ఇప్పటికీ ‘స్కైల్యాబ్’ అని పేర్లు పెట్టారు.
ఈక్రమంలోనే అప్పటి ఇతివృత్తాన్ని తీసుకొని ప్రముఖ యువ హీరో ‘సత్యదేవ్’ ‘స్కైలాబ్’ పేరుతో సినిమా తీస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ ను తాజాగా విడుదల చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది.
స్కైల్యాబ్ భూమి మీదకు దూసుకొస్తుందని రేడియోలో వింటున్న గ్రామస్థులు ఒక పాడుపడిన బావిలో దాక్కున్న వీడియో టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ ఉత్కంఠ కలిగిస్తుందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. మరీ ఈ సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.. రేపు 6.30 కు ఈ సినిమా పేరు, టీజర్ ను,పూర్తి వివరాలు తెలియజేస్తామని సత్యదేవ్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
https://www.instagram.com/p/CRJZdZCnvQG/?utm_source=ig_web_copy_link