NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక వరుసగా ఏడోవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వస్తున్న వార్ 2 సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్లో పాల్గొన్న ఆయన తమ తదుపరి షెడ్యూల్ లో కూడా తొందర్లోనే పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటం విశేషం… మరి మొత్తానికైతే ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. మరివాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక హృతిక్ రోషన్ కి వరుసగా ఫ్లాప్ లు వస్తున్న సమయంలో తెలుగు సినిమా హీరో అయితేనే తనకు ఈ సినిమా భారీగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఏరి కోరి మరి జూనియర్ ఎన్టీఆర్ ని ఈ సినిమాలో భాగం చేసినట్టుగా కూడా తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. మరి ఈ ఫామ్ ని ఇలాగే కొనసాగిస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం భారీ ఎత్తున రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఈ సినిమా కోసం ఆయన 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించేది కేవలం 30 నిమిషాలు మాత్రమే.. అయినప్పటికీ ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే మామూలు విషయం కాదు. మరి ఎన్టీఆర్ కి ఎంత అడిగినా సరే అంత మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా ఇవ్వడానికి ఆ సినిమా మేకర్స్ రెడీగా ఉన్నారు.
అందుకే ఎన్టీఆర్ అంత డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని తను తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండియన్ ఇండస్ట్రీలో తన విజయకేతనాన్ని ఎగరవేయాలని చూస్తున్నాడు…