Devara: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఒక వచ్చిన ఓపెనింగ్స్ ట్రేడ్ కి పెద్ద షాక్. ఎందుకంటే ఫ్లాప్ డైరెక్టర్ తో మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే సత్తా చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది, వారిలో ఎన్టీఆర్ ఒకరు అని మరోసారి రుజువు అయ్యింది. అంతే కాదు ఫ్లాప్ డైరెక్టర్స్ కి హిట్ ఇచ్చి , మళ్ళీ వాళ్లకు సరికొత్త జీవితాన్ని ఇవ్వడం ఎన్టీఆర్ కి బాగా అలవాటు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ కి ‘టెంపర్’ లాంటి హిట్ ఇచ్చాడు, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ బాబీ కి ‘జై లవ కుశ’ లాంటి సినిమాని ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ కి ‘అరవింద సామెత’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ కి ‘దేవర’ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చాడు.
ఇలా డైరెక్టర్స్ పాలిట ఆపద్బాంధవుడిగా మారిపోయాడు ఎన్టీఆర్. ఇదంతా పక్కన పెడితే ‘దేవర’ విడుదలై నిన్నటితో ఆరు రోజులు పూర్తి అయ్యింది. ఆరవ రోజు (నిన్న) గాంధీ జయంతి అవ్వడం, నేషనల్ హాలిడే అవ్వడం తో ఈ సినిమాకి తెలుగు, హిందీ భాషల్లో కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషలకు కలిపి 150 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన సినిమాగా నిల్చింది. ఆరవ రోజు ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం లో రెండు కోట్ల రూపాయిలు, సీడెడ్ లో కోటి 20 లక్షల రూపాయిలు, వైజాగ్ లో 60 లక్షల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 30 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 25 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లా లో 33 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 40 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మార్నింగ్ షోస్ నుండి ఫస్ట్ షోస్ వరకు వసూళ్లు అద్భుతంగా వచ్చినప్పటికీ, సెకండ్ షోస్ అన్ని ప్రాంతాలలో దారుణంగా డౌన్ అయ్యాయి, అందుకే ఓవరాల్ గా సెలవు దినం అయ్యినప్పటికీ ఆశించిన రేంజ్ వసూళ్లు రాలేదని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. అయితే ఈ చిత్రానికి ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, నేటి నుండి దసరా సెలవులు ప్రారంభం అవ్వడంతో ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తాయని అంటున్నారు.