Sarvam Maya Movie Review: మలయాళ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో నివిన్ పౌలీ ఒకడు. ప్రేమమ్ నుంచి మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన సినిమాలలో అతడు నటించాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ బలమైన ఫ్యాన్ బేస్ సృష్టించుకున్నాడు. ఈ నేపథ్యంలో నివీన్ తాజాగా సర్వం మాయం (sarvam mayaam) అనే సినిమాలో నటించాడు.
సర్వం మాయ అనే సినిమా హర్రర్, ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల వసూళ్లు అందుకుంది. కుటుంబ కథ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అందువల్లే ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించింది. నివీన్ పౌళి కెరియర్లో అతిపెద్ద హిట్ గా నిలిచింది.
నివీన్ పౌళి కొంతకాలంగా వరుస పరాజయాలను అందుకుంటున్నాడు. ఈసారి కథ విషయంలో విభిన్న తత్వాన్ని ప్రదర్శించిన నివీన్ పౌళి సర్వం మాయ అనే సినిమాతో మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నమోదయింది.
సర్వం మాయ సినిమా విడుదలైన తొమ్మిది రోజుల్లోనే 40 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. త్వరలోనే 50 కోట్ల వరకు వెళ్లిపోతుందని సినీ పండితులు చెప్తున్నారు. స్థిరమైన కలెక్షన్లు ఈ సినిమాకు వసూళ్ల పంట పండిస్తున్నాయి. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లో ప్రదర్శితం కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుంది.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన 35 నుంచి 40 రోజుల మధ్యలో ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కాగా, ఈ సినిమా విడుదలైన తొలి రోజు 51.48% ఆక్యుఫెన్సీ నమోదు చేసింది. అయితే రోజురోజుకు ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది. సర్వం మాయ సినిమాలో ప్రీతి ముకుందన్, జనార్ధన్ కీలక పాత్రలలో నటించారు . నివీన్ పౌళి కెరియర్ లో 2015 లో విడుదలైన ప్రేమమ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందని సినీ పండితులు చెబుతున్నారు. ట్రేడ్ ఇలానే కొనసాగితే స్వల్ప కాలంలో 100 కోట్ల మార్క్ అందుకుంటుందని పేర్కొంటున్నారు.