Sarkaru Vaari Paata OTT Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి భారీ విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో సఫలం అయ్యింది..ముఖ్యంగా మహేష్ బాబు నటన మరియు హావభావాలు పోకిరి సినిమాలో మహెష్ ని గుర్తు చేసింది..అందుకే సినిమా కంటెంట్ యావరేజి గా ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది..బ్యాంకు లోన్స్ పై మహేష్ బాబు ఇచ్చిన సందేశం ఫామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్లే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది అని సినీ విశ్లేషకుల అభిప్రాయం..ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఏ సినిమా అయినా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా రెండు మూడు వారాలకే OTT కి వచ్చేయడం మనం గమనిస్తూనే ఉన్నాము..ఇప్పుడు సర్కారు వారి పాట OTT రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.

Also Read: Nandamuri Taraka Ramarao: ఎన్టీఆర్ నట విశ్వరూపం సినీ విశ్వంలోనే శాశ్వతం !
థియేటర్స్ లో ఈ సినిమా ఇప్పటికి విజయవంతంగా నడుస్తున్న నేపథ్యం లో నిన్న విడుదల అయినా F3 సినిమాకి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది..దీనితో సర్కారు వారి పాట సినిమా థియేటర్స్ అన్ని F 3 సినిమాకి వెళ్లిపోయాయి..ఇప్పటికే 93 కోట్ల రూపాయిల థియేట్రికల్ షేర్ ని వసూలు చేసిన ఈ సినిమాకి ఇదే చివరి మంచి వీకెండ్ అవ్వడం తో మరో 3 నుండి 4 కోట్ల రూపాయిలు వసూలు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉండడం తో జూన్ 10 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధం అయ్యారు..థియేటర్స్ లో మంచి బిజినెస్ ని చేసిన ఈ చిత్రం OTT లో ఏ రేంజ్ సక్సెస్ ని చూస్తుందో చూడాలి..ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వారు దాదాపుగా 20 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు..ముందస్తుగా విడుదల చెయ్యడానికి నిర్మాతలు అంగీకరించడం తో ముందు అనుకున్న రేట్ కంటే ఎక్కువ ఇవ్వడానికి అమెజాన్ ప్రైమ్ సంస్థ ముందుకి వచ్చింది అట.
Also Read: Adavi Shesh Sunny Leon: అడవి శేష్ కి, సన్నీ లీయోన్ కి ఉన్న రిలేషన్ తెలుసా?


[…] Also Read: Sarkaru Vaari Paata OTT Update: సర్కారు వారి పాట OTT రిలీజ్ … […]
[…] Also Read: Sarkaru Vaari Paata OTT Update: సర్కారు వారి పాట OTT రిలీజ్ … […]