RCB loses IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ఆర్సీబీ ఓటమి.. రన్ మిషన్ కోహ్లీపై ట్రోల్స్

RCB loses IPL Playoffs: విరాట్ కోహ్లి మాజీ కెప్టెన్. తనదైన శైలిలో బ్యాటింగ్ తో అందరికి సమాధానాలు చెప్పిన కోహ్లి కొద్ది కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాలం కలిసిరాకపోవడంతో అపఖ్యాతి మూటగట్టుకుంటున్నాడు. పేలవమైన ప్రదర్శనతో విమర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. అవసరమైన సమయంలో ధాటిగా ఆడితే విమర్శలు రావు. కానీ గత కొద్ది కాలంగా విరాట్ కోహ్లి తన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసే దిగ్గజం నేడు ఎందుకో తన ప్రదర్శన మెరుగుపరుచుకోవడం లేదు. ఫలితంగా […]

Written By: Srinivas, Updated On : May 28, 2022 12:00 pm
Follow us on

RCB loses IPL Playoffs: విరాట్ కోహ్లి మాజీ కెప్టెన్. తనదైన శైలిలో బ్యాటింగ్ తో అందరికి సమాధానాలు చెప్పిన కోహ్లి కొద్ది కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కాలం కలిసిరాకపోవడంతో అపఖ్యాతి మూటగట్టుకుంటున్నాడు. పేలవమైన ప్రదర్శనతో విమర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. అవసరమైన సమయంలో ధాటిగా ఆడితే విమర్శలు రావు. కానీ గత కొద్ది కాలంగా విరాట్ కోహ్లి తన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసే దిగ్గజం నేడు ఎందుకో తన ప్రదర్శన మెరుగుపరుచుకోవడం లేదు. ఫలితంగా విమర్శల మూటలు ఎత్తుకుంటున్నాడు.

RCB

ఐపీఎల్ సీజన్ లో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కోసం ఆడుతున్నా ప్రతి మ్యాచులోను పరుగులు చేయలేకపోతున్నాడు. దీంతో అభిమానుల నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఫైనల్ మ్యాచ్ కోసం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి రాణించకపోవడంతోనే ఓటమి పాలైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడు కోహ్లి కాదు చోక్లీ అని విమర్శలకు దిగుతున్నారు. దీంతో విజయాల బాటలో ఉన్న వీరుడికి అపజయాలే స్వాగతం పలుకుతుండటంతో కోలుకోలేని విధంగా విమర్శల్లో మునిగిపోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Bharat Ratna To NTR: ఎన్టీఆర్ కి ‘భారతరత్న.. ప్రతి తెలుగు వాడు మేల్కొవాలి !

కోహ్లిని బెంగుళూరు జట్టు నుంచి తొలగించాలనే వాదనలు కూడా వస్తున్నాయి. అయినా అతడిలో ఇంతవరకు మార్పు కనిపించడం లేదు. ఈ సీజన్ మొత్తంలో 16 మ్యాచులు ఆడి 341 పరుగులు మాత్రమే రాబట్టాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి దీంతో విరాట్ కోహ్లి భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. అసలు అతడిని జట్టులో ఉంచుకుంటారో లేక మొత్తానికి తొలగిస్తారో కూడా తెలియడం లేదు. బ్యాట్ తో మెరిపించాల్సి ఉన్నా ఎందుకో తగిన విధంగా ఆడటం లేదు.

RR Vs RCB

కోహ్లిపై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది కొద్ది కాలంగా అతడి ఆటతీరు బాగా లేదని విశ్లేషకులుసైతం చెబుతున్నారు. అయినా అతడి ఆటతీరులో మార్పులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లి భవిష్యత్ డైలమాలో పడుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అతడిని జట్టులో ఉంచకుండా దూరం చేసే ఆలోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం. భారత జట్టుకు ఎంతో సేవ చేసినా ప్రస్తుతం మాత్రం అతడిని వదిలించుకోవడానికి మొగ్గు చూపుతున్నారనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ ఎందుకు చెత్తగా ఆడుతున్నాడు. అతడిలో పటుత్వం తగ్గిందా? లేక ఆటపై శ్రద్ధ పెట్టడం లేదా? అనే అనుమానాలు అందరికి వస్తున్నాయి. మొత్తానికి విరాట్ కోహ్లి మళ్లీ తన బ్యాట్ తో అభిమానులను అలరించాలని ఆశిస్తున్నారు.

Also Read: Love Agreement: రూ.100 బాండ్ పేపర్ పై ప్రేమికుల అగ్రిమెంట్

Tags