Ticket Rates: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..లాంగ్ వీకెండ్ లో కలెక్షన్స్ కుమ్మేసిన తర్వాత కూడా మాములు వర్కింగ్ డేస్ లో ఈ సినిమా పర్వాలేదు అని అనిపించేలా స్టడీ కలెక్షన్స్ తో 100 కోట్ల రూపాయిల షేర్ కలెక్షన్స్ వైపు పరుగులు తీస్తుంది..

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికి మంచి వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా, తెలంగాణాలో మాత్రం ఆశించిన స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతుంది..దానికి కారణం మితిమీరిన టికెట్ రేట్స్ వల్లే అని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..OTT రాజ్యం ఏలుతున్న సమయం లో ఒక్క సినిమాకి కుటుంబం మొత్తం వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు చేసి థియేటర్ లో చూడడం జరగని పని అని సర్కారువారి పాట సినిమా కలెక్షన్స్ ని చూస్తే అర్థం అయ్యిపోతుంది..
Also Read: Jabardasth : జబర్ధస్త్ లో సుధీర్, గెటప్ శ్రీను లేక ఒంటరైన రాంప్రసాద్ ఏం చేశాడంటే?
టికెట్ రేట్స్ పెంచడం వల్ల ఈ సినిమాకి తెలంగాణ ప్రాంతం లో దాదాపుగా 5 కోట్ల రూపాయిల నష్టం వచ్చినట్టు తెలుస్తుంది..అదే సామాన్యుడికి అందుబాటులో ఉన్న టికెట్ రేట్స్ పెట్టి ఉంటె ఈ సినిమాకి ఇక్కడ కూడా అద్భుతమైన వసూళ్లు వచ్చి ఉండేవి అని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు..ఇక విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకొని రెండవ వారం లోకి అడుగుపెట్టిన ఈ సినిమాకి ఇప్పుడు తెలంగాణ ప్రాంతం లో టికెట్ రేట్స్ తగ్గించేశారు..

దీని వల్ల ఈ వీకెండ్ మంచి వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సోమవారం నుండి టికెట్ రేట్స్ తగ్గిపోనున్నాయి..దీనితో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు..ఇప్పటికే 85 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
Also Read: YS Bharathi- Sarkaru Vaari Paata: మహేష్ సినిమా పై జగన్ సతీమణి ప్రశంసలు
Recommended Videos


