Pawan Kalyan Nalgonda Tour: ఏపీలో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలను ఓదార్చి వారికి ఆర్థికసాయం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణలోనూ అదే పనిచేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. మృతిచెందిన సొంత పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నారు.. తెలంగాణలోని నల్గొండ జిల్లాలో రేపు పర్యటించబోతున్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. వారికి ఆర్థిక సాయం అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పించనున్నారు.పవన్ కళ్యాణ్ ఉదారతతో చేస్తున్న ఈ పని జనసైనికుల్లో గొప్ప ధైర్యాన్ని నింపుతోంది. వారిలో మనో నిబ్బరాన్ని కలిగిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, కోదాడలో పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు మొదలైనట్టు ఆయన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: Hero Arjun Becomes Director: డైరెక్టర్ గా మారిన హీరో అర్జున్.. తొలి సినిమా ఎవరితోనో తెలుసా?
చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. రేపు నల్గొండ జిల్లాలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించనున్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో బయలుదేరి మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు.
అక్కడి నుంచి బయలు దేరి కోదాడకు వెళ్లి కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని ప్రకటనలో వివరించారు. పవన్ పర్యటనకు సంబంధించి చౌటుప్పల్, కోదాడల్లో జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Jabardasth : జబర్ధస్త్ లో సుధీర్, గెటప్ శ్రీను లేక ఒంటరైన రాంప్రసాద్ ఏం చేశాడంటే?
20న శ్రీ @PawanKalyan గారు ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన pic.twitter.com/uERNoQwPmK
— JanaSena Party (@JanaSenaParty) May 19, 2022