https://oktelugu.com/

‘స‌ర్కారు వారి పాట‌’ క్రేజీ అప్డేట్.. థియేట‌ర్లో ఫ్యాన్స్ గోల గోలేనట!

టైటిల్ తోనే హై క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్. రెండు రోజుల క్రితమే దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది యూనిట్. మార్చిలో గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్. Also Read: ఇప్ప‌టికీ రిలీజ్ కాని.. జూ.ఎన్టీఆర్ మొదటి సినిమా తెలుసా? బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు కాజేసే ఆర్థిక నేరగాళ్ల పనిపట్టే కథతో వస్తోందీ […]

Written By:
  • Rocky
  • , Updated On : February 24, 2021 / 06:10 PM IST
    Follow us on


    టైటిల్ తోనే హై క్యూరియాసిటీ క్రియేట్ చేసిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్. రెండు రోజుల క్రితమే దుబాయ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది యూనిట్. మార్చిలో గోవాలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్.

    Also Read: ఇప్ప‌టికీ రిలీజ్ కాని.. జూ.ఎన్టీఆర్ మొదటి సినిమా తెలుసా?

    బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయలు కాజేసే ఆర్థిక నేరగాళ్ల పనిపట్టే కథతో వస్తోందీ మూవీ. తన తండ్రిపై మోపిన నిందను తుడిచేసి, నిజమైన నేరగాళ్లను పట్టించే కొడుకు పాత్రలో నటించబోతున్నాడట మహేష్. ఈ మూవీలో మహేష్ బాబు గెటప్ కూడా చాలా మారబోతోంది. చాలాకాలం తర్వాత లాంగ్ హెయిర్‌తో కనిపించబోతున్నాడు ప్రిన్స్. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్స్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఇప్పుడో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది.

    ఈ మూవీలో మాస్ సాంగ్ తో ఊపేయబోతున్నాడట మహేష్. చాలాకాలంగా ఓ మోస్తరు డ్యాన్స్ తోనే మెప్పిస్తున్న ప్రిన్స్.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో దుమ్ములేపాడు. ‘మైండ్ బ్లాక్..’ పాటలో లుంగీ పైకి కట్టి అద్దిరిపోయే స్టెప్పులు వేశాడు. కాగా.. ఇప్పుడు పరశురామ్ కూడా మరోసారి పట్టుబట్టి సూపర్ స్టార్ తో అద్భుతమైన డ్యాన్స్ చేయించబోతున్నాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుమీదున్న శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న స్టెప్పులు కేక పెట్టించే రీతిలో ఉండబోతున్నాయట.

    Also Read: నేచురల్ స్టార్ నాని.. ప్రేక్షకులు నిలబెట్టిన నటుడు..!

    ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయింది. ఇక, షూటింగ్ చేయడమే మిగిలి ఉంది. థమన్ అందించిన అద్భుతమైన మాస్ బీట్ కు మహేష్ వేయబోతున్న స్టెప్పులు కేక పెట్టించబోతున్నాయని సమాచారం. ఈ పాట ఖ‌చ్చితంగా నెవ్వ‌ర్ బిఫోర్ రేంజ్ లో ఉంటుంద‌ని, థియేట‌ర్లో ఫ్యాన్స్ లు ఈల వేసి గోల‌చేయ‌డం ఖాయ‌మ‌ని టాక్‌.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్